Saturday, April 12, 2025
HomeతెలంగాణGarla: చేయూత ఫౌండేషన్‌ సేవలు అభినందనీయం

Garla: చేయూత ఫౌండేషన్‌ సేవలు అభినందనీయం

సేవలకు సలాం

పేదలకు బాసటగా నిలిచి అవసరమైన సేవలను అందించేందుకు చేయూత ఫౌండేషన్‌ చేస్తున్న కృషి అభినందనీయమని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. ఇటీవల కాలంలో ఆటో ప్రమాదంలో మృతి చెందిన డబ్బేటి బుచ్చి రాములు తోపాటు 8 మంది మహిళలకు కాళ్ళు, చేతులు విరిగిన వారిని ఆదుకునేందుకు చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో గార్ల మండల పరిధిలోని సత్యనారాయణపురం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య ముఖ్య అతిధిగా హాజరై బాధితులకు నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ చేసి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల పాలిట కల్పవృక్షం చేయూత ఫౌండేషన్ అని నిస్వార్ధ సేవే లక్ష్యంగా చేయూత ఫౌండేషన్ గ్రామాభివృద్ధికి పాటు పడేలా పని చేయాలనీ సూచించారు. అభాగ్యులకు ఆకలి తీర్చే ఆపన్న హస్తం, నిరుపేదల సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్న చేయూత ఫౌండేషన్ చైర్మన్ భూక్యా రమేష్ ను ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో గార్ల పి ఏ సి ఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్, ఇల్లందు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా నాగేశ్వరావు, కాంగ్రెస్ పార్టీ గార్ల మండల అధ్యక్షులు ధనియాకుల రామారావు, చేయూత ఫౌండేషన్ చైర్మన్ భూక్యా రమేష్, మాలోత్ సురేష్, రాజా, నాగేశ్వరావు, శ్రీను, యాంటోని, చిన్న, ఉమా, మల్లికాంబ, సుభద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News