అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. బీజేపీపై ధ్వజమెత్తిన హరీష్.. బీజేపీపై నిప్పులు చెరుగుతూ తన ప్రసంగాన్ని ఆద్యంతం కొనసాగించారు. బీజేపీ ఎందులో సక్సస్సో తెలుసా అంటూ.. ఆయన మాట్లాడిన మాటలు ఆలోచింపచేసేలా ఉన్నాయి.
జీడీపీని మంటగలపడంలో – సక్సెస్, ఫుడ్ సెక్యూరిటీని నాశనం చేయడంలో – సక్సెస్, 160 లక్షల కోట్ల అప్పులు చేయడంలో – సక్సెస్, సెస్సుల రూపంలో అడ్డగోలుగా పన్నులు వేయడంలో – సక్సెస్, ఆకాశాన్ని తాకేట్టు సిలిండర్ ధర పెంచడంలో – సక్సెస్, పసిపిల్లలు తాగే పాల మీద కూడా జీఎస్టీ విధించడంలో – సక్సెస్, ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టడంలో – సక్సెస్, ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐ దాడులు చేయించడంలో – సక్సెస్, రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతను కాలరాయడంలో – సక్సెస్, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడంలో – సక్సెస్, ఆదానీ ఆస్తులు పెంచడంలో – సక్సెస్, రొటేషన్ లో వచ్చే G-20 ప్రెసిడెంట్ షిప్ ను తమ ఘనతగా చెప్పుకోవడంలో – సక్సెస్, మతపిచ్చి మంటలు రేపడంలో….. డబుల్ సక్సెస్..అంటూ హరీష్ ప్రసంగం సాగింది.