మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, ఆరూరి రమేష్ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ప్రగతి భవన్ ను గ్రెనేడ్ల తో పేల్చేయాలనే పథక రచనకు దిగిన రేవంత్ ఓ అసాంఘిక శక్తిగా మారారని..ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ సీఎం కార్యాలయాన్ని కూడా పేల్చేస్తారా అంటూ బీఆర్ఎస్ నేతలు రేవంత్ పై నిప్పులు చెరిగారు. రేవంత్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. పిడీ యాక్ట్ పెట్టాలి మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. రేవంత్ ఓ బ్లాక్ మెయిలర్, రేవంత్ ఓ జోకర్, బ్రోకర్ అంటూ అధికార పార్టీ ఒంటికాలు మీద లేచింది. ప్రజల మద్దతు కరువుకావటంతో.. మీడియా కంట్లో పడేందుకు రేవంత్ తప్పుడు కూతలు కూస్తున్నారని వీరు మండిపడ్డారు.