Friday, November 22, 2024
HomeతెలంగాణKarimnagar: ఒకే వ్యక్తి పేరుపైన 26 ఇంటి నెంబర్లు!

Karimnagar: ఒకే వ్యక్తి పేరుపైన 26 ఇంటి నెంబర్లు!

రేకుర్తిలో భూఅక్రమాలకు అడ్డుకట్టపడేనా?

ప్రభుత్వ స్థలంపై కన్నేసిన భూ అక్రమార్కులు అధికార యంత్రాంగాన్ని మచ్చిక చేసుకుని ప్రభుత్వ భూములను కాజేసేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. గత పది ఏళ్లలో భూముల రేట్లు ఒకటికి పదింతలు పెరగడంతో ప్రస్తుతం భూములను కొనాలంటే సామాన్యులకు సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. కానీ కొంతమంది భూ అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలకు నకిలీ పత్రాలు సృష్టించడం, అమాయక ప్రజలను మోసం చేస్తుండడం ఇక్కడ నిత్య కృత్యమవుతుంది. ఇది ఎక్కడో కాదు కరీంనగర్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న రేకుర్తిలోనే… గ్రామపంచాయతీగా ఉన్న రేకుర్తి 2018 లో కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనం అయింది. కానీ కొంతమంది ఆక్రమార్కులు ఒక్కరి పేరు పైనే 26 ఇంటి నెంబర్లు తీసుకొని ఇంటి పన్నును కట్టినట్లు గ్రామ పంచాయతీ కార్యాలయం పేరుతో ఫోర్టరీ పత్రాలను సృష్టించారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒకే వ్యక్తిపై 26 ఇంటి నెంబర్లను మంజూరు చేయడం చూస్తుంటే ఏ స్థాయిలో డబ్బులు చేతులు మారాయో అర్థం చేసుకోవచ్చు.

- Advertisement -

నకిలీ పత్రాలు సృష్టించడంతో పాటు ఒకే పేరుపై ఎన్ని ఇండ్లనైనా మంజూరు చేస్తూ ప్రభుత్వ భూములను కాజేస్తున్న తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తినప్పటికీ అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరించడంతో భూ కబ్జాదారులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ప్రస్తుతం సదరు వ్యక్తి తన పేరు మీద ఉన్న 26 ఇంటి నెంబర్లలో 19 ఇంటి నెంబర్లను ఇతరుల పేరు పైకి బదలాయింపు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక్కరి పేరు పైనే ఇలా జరిగిందంటే రేకుర్తిలోని ప్రభుత్వ భూములపై క్షేత్రస్థాయిలో విచారణ చేపడితే ఇంకెన్నో అవినీతి కుంభకోణాలు వెలుగు చూసే అవకాశం ఉంటుంది. ఫోర్జరీ పత్రాలు సృష్టించిన వారిపై అధికార యంత్రాంగం. ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ‘భూ అక్రమాలకు పాల్పడ్డ వారి వెన్నులో వణుకు పుడుతుంది.

19 వ డివిజన్ రేకుర్తి పరిధిలోని ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై లోతైన విచారణ జరిపి, భూ అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News