Thursday, May 9, 2024
HomeదైవంIllanthakunta: కనుల పండుగగా శ్రీ సీతారాములకు చక్ర స్నానం, శ్రీ పుష్పయాగం

Illanthakunta: కనుల పండుగగా శ్రీ సీతారాములకు చక్ర స్నానం, శ్రీ పుష్పయాగం

రామనవమి ఉత్సవాలు

అపర భద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ సీతారాములకు చక్రస్నానం వేడుకను అంగరంగ వైభవంగా జరిపించారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల మధ్య వేద పండితులు సీతారాముల ఉత్సవమూర్తులకు చక్ర జల్లు స్నానం కార్యక్రమాన్ని జరిపించి ఆలయ కోనేరులో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -

శుక్రవారం రాత్రి శ్రీ సీతారాములకు శ్రీ పుష్పయాగం వేడుకను అర్చకులు వైభవోపేతంగా జరిపించారు. శ్రీ సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ఆవరణలో అందంగా అలంకరించిన వేదికపై సుగంధ పరిమళ పుష్పాలంకృతులైన శ్రీ సీతారాముల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చగా మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల నడుమ ఆలయ ప్రధాన అర్చకులు శేషం రామాచార్యులు, శేషం వంశీధరాచార్యులు, శేషం సీతారామాచార్యుల ఆధ్వర్యంలో వేద పండితులు శ్రీ సీతారాములకు శ్రీ పుష్పయాగం (నాఖబలి) వేడుకను వైభవోపేతంగా జరిపించారు.

శ్రీ పుష్పయాగం వేడుకకు హాజరైన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో కందుల సుధాకర్ ఆధ్వర్యంలో తగు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు కావటి మోహన్, రవి, రాజయ్య, మల్లారెడ్డి, రమేష్, ప్రవీణ్ అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News