ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దాఖలు చేసిన నామినేషన్లో పెండింగ్ ఉందని, నామినేషన్ పత్రంలో పలు ఆస్తులు బుగ్గన పొందుపర్చ లేదనీ టిడిపి అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాశ్ న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. అంతేగాకుండా నామినేషన్ లో పలు కాలమ్స్ ఖాళీగా వదిలేసారని, అప్లికేషన్ పూర్తిగా ఫిల్ చేయకుండా ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని వాదన చేశారు. దీంతో బుగ్గన నామినేషన్ పెండింగులో పెట్టి సమాధానం ఇవ్వాలని ఆర్వో బుగ్గన న్యాయవాదులకు నోటీసులు జారీచేసినట్టు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సమాచారం అందరికీ తెలిసిందే. ప్రజా ప్రాతినిధ్య చట్టం,1951లోని సెక్షన్ 36 ప్రకారం రిటర్నింగ్ అధికారి నామినేషన్ పత్రాన్ని మరలా పరిశీలించి, బుగ్గన రాజేంద్రనాథ్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నామినేషన్ అంగీకరించినట్టు రిటర్నింగ్ అధికారి బి. మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు.
Dhone: బుగ్గన నామినేషన్ అంగీకారం
బుగ్గన నామినేషన్ అంగీకరించలేదని సోషల్ మీడియాలో హల్చల్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES