గోదావరిఖని జవహర్ నగర్ లో శ్రీ రాజరాజేశ్వర హైస్కూల్లో 1995 – 96 వ సంవత్సరం పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నగరంలోని ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులంతా ఒకచోట కలుసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ తాము చదువుకున్న రోజుల్లో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. చాలా సంవత్సరాల తర్వాత తమతో చదువుకున్న మిత్రులను కలుసుకోవడంతో ఆనందం వ్యక్తం చేశారు.
- Advertisement -
ఈ సందర్భంగా తమకు చదువు నేర్పిన గురువులను పూలమాలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.