Thursday, September 19, 2024
HomeఆటDhoni: పొలం దున్నుతున్న ధోని..రెండేళ్ల తరువాత ఇన్స్టాలోకి రీ ఎంట్రీ

Dhoni: పొలం దున్నుతున్న ధోని..రెండేళ్ల తరువాత ఇన్స్టాలోకి రీ ఎంట్రీ

తన పొలం పనుల్లో జార్ఖండ్ డైనమైట్ మహేందర్ సింగ్ ధోని బిజీగా ఉన్నారు. ఈమేరకు ఆయన స్వయంగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. కాస్త లీజర్ దొరికితే సొంతూళ్లో టైం స్పెండ్ చేయటం ధోనికి ఇష్టమైన వ్యాపకం. అలా తన ఫ్రెండ్స్, బైక్స్, కార్స్ అంటూ కూల్ గా టైం పాస్ చేసే ఈ ఏస్ క్రికెటర్ తాజాగా పొలం పనులు చేస్తున్నారు. రెండేళ్ల విరామం తరువాత ఇన్స్టాలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చిన మాజీ కెప్టెన్ ధోని పొలం దున్నుతున్న వీడియోను పోస్ట్ చేశారు. ట్రాక్టర్ డ్రైవ్ చేసుకుంటూ ఆయన పొలం దున్నే వీడియో చాలా బాగుందని ఫాలోయర్స్ అంటున్నారు. జార్ఖండ్ లోని రాంచీలో ఉన్న పొలంలో ట్రాక్టర్ తోలుతూ, దున్నే పనులు కాస్త కష్టమైనవే అంటూ ఆయన ఈ వీడియోకి క్యాప్షన్ జోడించారు.

- Advertisement -

కోటి వ్యూస్

ధోని ఇలా వీడియో పోస్ట్ చేశాడో లేదో నాలుగు గంటలు కూడా గడవకముందే కోటి వ్యూస్ వచ్చిపడ్డాయి. అంతేకాదు 28 లక్షల లైక్స్.. 60,000కు పైగా కామెంట్స్.. వామ్మో..మరదే ధోనీకి ఉన్న క్రేజ్ అంటే. అయితే దీనిపైన భలే జోక్స్ కూడా పేలుతున్నాయి. ఒక యూజర్ అయితే.. ఎట్టకేలకు రెండేళ్ల తరువాత ధోనికి ఇన్స్టా పాస్ వర్డ్ గుర్తుకొచ్చిందని ఫన్నీగా కామెంట్ చేశాడు. 2021, జనవరి 8వ తేదీన ఈ లెజెండరీ క్రికెటర్ తన లాస్ట్ ఇన్స్టా పోస్ట్ చేశారు. ఆ వీడియో కూడా తన తోటలోని స్ట్రాబెర్రీ పంటదే కావటం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News