Thursday, September 19, 2024
Homeనేరాలు-ఘోరాలుGhatkesar: మద్యంలో విషం.. భర్త ఖతం.. ప్రియుడితో జైలు

Ghatkesar: మద్యంలో విషం.. భర్త ఖతం.. ప్రియుడితో జైలు

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తకు మద్యంలో విషం కలిపి ఇచ్చిన భార్య ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. తన భర్త వివాహేతర సంబంధానికి అడ్డు తగులుతున్నాడనే కారణంగా ఓ భార్య భర్తను విషమిచ్చిన దారుణం ఘటకేసర్ లో జరిగింది. విషం కలిపిన మద్యం తాగిన భర్త కొద్ది సేపటికే కడుపు నొప్పిగా ఉందని చెప్పడంతో భార్య అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లింది. చికిత్స పొందుతూ భర్త మృతి చెందినట్టు పక్కా ప్లాన్ తో.. గ్రామస్థులను నమ్మించే ప్రయత్నం చేసింది నిందితురాలు. తన భర్తది సాధారణ మరణంగా నమ్మించే ప్రయత్నం చేయగా.. అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు గ్రామస్థులు. దీంతో భార్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన ఘట్ కేసర్ పోలీసులు ఆమెతో నిజం కక్కించారు. ప్రియుడి సూచన మేరకు విషంతో కూడిన మద్యం ఇచ్చినట్టు చివరికి ఆమె ఒప్పుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News