Friday, November 22, 2024
HomeతెలంగాణGodavarikhani: కారు జోరు, పట్టణంలో గులాబీ శ్రేణుల బైక్ ర్యాలీ

Godavarikhani: కారు జోరు, పట్టణంలో గులాబీ శ్రేణుల బైక్ ర్యాలీ

గులాబీమయమైన కోల్ బెల్ట్

చివరి రోజు ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గులాబీ పార్టీ శ్రేణులు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. గోదావరిఖని రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి బి.ఆర్.ఎస్. ఎం.పి. అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

- Advertisement -

అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. గోదావరిఖని పట్టణంలోని ప్రధాన చౌరస్తా నుంచి వివిధ కాలనీల మీదుగా జోరుగా కొనసాగింది. ఆట పాటలు, డాన్సులతో పార్టీ శ్రేణులు హోరెత్తించారు. దీంతో కోల్ బెల్ట్ ప్రాంతం గులాబీమమైంది. దారి పొడవునా వందలాది బైకులు ర్యాలీలో పాల్గొన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News