Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుAssam: అస్సాం అరెస్టులు 2,763..అయినా ఇంకా తగ్గేదేలే అంటున్న సీఎం

Assam: అస్సాం అరెస్టులు 2,763..అయినా ఇంకా తగ్గేదేలే అంటున్న సీఎం

అస్సాంలో బాల్యవివాహాల అరెస్టులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 2,763 అరెస్టులు జరగ్గా ఇంకా మరిన్ని అరెస్టులకు రంగం సిద్ధమైంది. బాల్య వివాహాలు చేసుకున్న వారు, చేయించి న పెద్దలంతా పరారీలో ఉన్నారు. ఇప్పటికే 4,135 కేసులు నమోదు కాగా ఇంకా అరెస్టులు పూర్తి కాలేదు.

- Advertisement -

బాల్య వివాహాలకు బలైన వారికి పునరావాస కార్యక్రమాన్ని అస్సాం సర్కారు సిద్ధంచేస్తోంది. మరోవైపు భర్తలు జైళ్లలో ఉండగా వారి భార్యలు అంటే మైనర్ అమ్మాయిలకు ప్రత్యేక చేయూత ఇచ్చేలా హిమంతా బిశ్వాస్ శర్మ సర్కారు అడుగులు వేస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని సీఎం హిమంతా వ్యక్తిగతంగా నిత్యం సమీక్షిస్తున్నారు. ముగ్గురు సభ్యుల క్యాబినెట్ కమిటీ ఈ బాల్యవివాహాలపై పూర్తిస్థాయి కసరత్తు చేస్తోంది. మరో 15 రోజుల్లో సమగ్ర రీహాబిలిటేషన్ పాలసీని రూపొందించి అమలు చేసేందుకు క్యాబినెట్ సబ్ కమిటీ కూడా రంగంలోకి దిగింది. అస్సాంలో టీనేజ్ ప్రెగ్నెన్సీలు అమ్మాయిల కొంప ముంచుతున్నాయని హిమంతా ఆవేదన వ్యక్తంచేస్తూ నిత్యం ట్వీట్లు పోస్ట్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News