Saturday, September 28, 2024
HomeతెలంగాణChevella: బార్ అసోసియేషన్ కార్యదర్శి జన్మదిన వేడుకలు

Chevella: బార్ అసోసియేషన్ కార్యదర్శి జన్మదిన వేడుకలు

తొలి దళిత కార్యదర్శి కూడా..

చేవెళ్ల మున్సిఫ్ కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ కార్యదర్శి బేగరి సత్యానందం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ మెంబర్స్ సహ న్యాయవాదులు కలిసి చేవెళ్ళ మండలం కేందంలో ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించారు.

- Advertisement -

బార్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి మహమ్మద్ తాజుద్దీన్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరిపారు. తాజుద్దీన్ మాట్లాడుతూ..చేవెళ్ల బార్ అసోసియేషన్ కార్యదర్శిగా మొదటిసారిగా దళిత వర్గానికి చెందిన సత్యానందం ఎన్నిక కావడం గర్వకారణం అన్నారు. బార్ అసోసియేషన్ సమస్యల పరిష్కారానికి తామంతా కలిసికట్టుగా తమ వంతు కృషి చేస్తామన్నారు.

సత్యానందం మాట్లాడుతూ.. బార్ అసోసియేషన్ సభ్యులుగా స్థానం కల్పించిన న్యాయవాదులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. వారి మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. బార్ అసోసియేషన్ లో ఉన్న సమస్యలను పెద్దల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు.

ఈ వేడుకల్లో గుట్టల. చంద్రశేఖర్ ఎల్. జైపాల్ కే. కుమార్ డి. సురేష్ శ్రీకాంత్ బి. శ్రీశైలం కృష్ణ గౌడ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News