Monday, June 24, 2024
Homeనేరాలు-ఘోరాలుGarla: గవర్నమెంట్ ఆసుపత్రిలో వైద్యులు లేక..

Garla: గవర్నమెంట్ ఆసుపత్రిలో వైద్యులు లేక..

గాయపడ్డ వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై కొన ఊపిరితో ఉన్న అశోక్ ను గార్ల మండల కేంద్రంలోని స్థానిక పీహెచ్ సి హాస్పిటల్ లకు వైద్యం నిమిత్తం తరలించగా, హాస్పిటల్ లో వైద్యులు లేకపోవడంతో సకాలంలో వైద్యం అందకపోవటంతో అశోక్ మృతి చెందారని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు అశోక్ మృతదేహంతో అందోళన నిర్వహించారు.

- Advertisement -

ఈ అందోళనకు సిపిఎం మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్ మద్దతు ప్రకటించి మాట్లాడుతూ 24 గంటల పాటు పూర్తి స్దాయిలో వైద్యులు ఉండేలా చర్యలు తీసుకోవాలని గతంలో అనేక సార్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టరుకు సంబంధిత అధికారులకు చెప్పడం, వినతి పత్రాలు ఇవ్వడం, అందోళనలు చేపట్టినా పట్టించుకోలేదని ఆరోపించారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఒక కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి, అనాథగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకుంటామని ఫోన్ ద్వారా హమీ ఇవ్వడంతో గార్ల-బయ్యారం సిఐ రవికుమార్ చొరవతో అందోళన విరమించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News