శ్రీశైలం మహాక్షేత్రంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈనెల 21 వరకు 11 రోజులపాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రతిరోజు విశేష పుష్పాలంకరణలు, విశేష పూజాదికాలు, సాయంత్రం వివిధ వాహన సేవలు, కనులు మిరమిడ్లు గొలుపే విద్యుత్ బలంకరణలతో వివిధ కళాకారుల కళా నృత్యాలు నడుమ ప్రతిరోజు భక్తులకు కన్నుల పండుగగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ప్రతినిత్యం వేల సంఖ్యలో భక్తులు శ్రీశైలంకు పోటెత్తనున్నారు.
మొదటి రోజు కార్యక్రమాలు
ఉదయం : గం॥ 8-46లకు
యాగశాల ప్రవేశం, వేదస్వస్తి, శివసంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవాచనం, చండీశ్వరపూజ, కంకణపూజ, దీక్షాకంకణ,ఋతిగర్వణం
ఉదయం : గం॥ 10-00లకు
అఖండదీపారాధన, వాస్తుపూజ, వాస్తుహోమం, మండపారాధన, రుద్రకల శస్థాపన, పంచావరణార్చనలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు,
సాయంత్రం : గం॥ 5-30లకు
సాయంకాలార్చనలు, అగ్నిప్రతిష్ఠాపన, అంకురారోపణ.
సాయంత్రం : గం॥ 6-00లకు
శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానం, శ్రీకాళహస్తి తరఫున శ్రీస్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ
రాత్రి : గం॥ 7-00లకు
భేరీపూజ, భేరీతాడనం,
సకల దేవతాహ్వానపూర్వక ధ్వజారోహణ,
ధ్వజపట ఆవిష్కరణ.