మూడు రోజుల్లోనే వరి ధాన్యం రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని, ప్రతిపక్షాలకు రుచించక రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క అన్నారు. ప్రజా అవసరాలను తీర్చడంలో రాజీవ్ గాంధీ చూపిన మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తుందని భట్టీ వెల్లడించారు.
- Advertisement -
గత ప్రభుత్వంతో పోలిస్తే యాసంగిలో కొనుగోలు కేంద్రాల ప్రారంభం, కొనుగోలు కేంద్రాల సంఖ్య, ధాన్యం సేకరణ, నగదు జమ చేసే అన్ని విషయాల్లోనూ ముందంజలో ఉన్నామని, 500 బోనస్ సన్న ధాన్యంతో మొదలుపెట్టామన్నారు. మొలకెత్తిన ధాన్యం సైతం కొనుగోలు చేస్తామన్నారు. వరి వేస్తే ఉరే అని నాటి సీఎం కేసీఆర్ అన్నాడని భట్టీ గుర్తుచేశారు.