టర్కీ మృతుల సంఖ్య 25,000 దాటింది. సోమవారం నాడు వచ్చిన మూడు భారీ భూకంపాలకు టర్కీలో ఇలా వేల మంది అకాల మరణంపాలయ్యారు. దీంతో టర్కీలో సామూహిక ఖననాలు సాగుతున్నాయి. శిథిలాలను తొలగించే పనులు ఇంకా జరుగుతుండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే సూచనలున్నాయి.
ఇక టర్కీని ఆనుకుని ఉన్న సిరియాలో కనీసం 53లక్షల మంది ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులగా ఉండాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం కనీసం టర్కీ-సిరియా భూభాగాల్లోని 870,000 మంది ప్రజలకు భోజనం తక్షణం అందివ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. దేశ విదేశాలకు చెందిన డిజాస్టర్ మేనేజ్మెంట్ టీములు టర్కీకి సాయం అందిస్తున్నాయి. భూకంపం సంభవించి 5 రోజులు దాటిపోయినా టర్కీ సర్కారు తమకు ఎటువంటి సహాయం చేయటం లేదని టర్కీ ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.