స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అన్న పదానికి వీరు స్ఫూర్తిదాయకం, చిన్ననాటి నుండి కలిసిమెలిసి చదువుకొని పదో తరగతి వరకు కలం పట్టి పుస్తకాలతో కుస్తీ గురువుల విద్య బోధనలతో కలిసిమెలిసి చదువుకొని 10 అనంతరం దూరమైపోయిన వారు 36 సంవత్సరాలు తర్వాత ఒకే వేదికపై అందరూ కలవడంతో పండుగ వాతావరణం నెలకొంది, మద్దికేర జిల్లా పరిషత్ పాఠశాలలో 1987-88 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసుకున్న వారు ఆదివారం మద్దికెరలోని కె.వి. ఆర్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో, పూర్వ విద్యార్థుల సమ్మేళన నిర్వహించారు.
ఆనాటి విద్యార్థి విద్యార్థినీలు కలిసి మెలిసి సంతోషంగా సమ్మేళ నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, ఒకరికొకరు పరిచయం చేసుకొని, ఎవరెవరు ఏ వృత్తిలో కొనసాగుతున్నారో అడిగి తెలుసుకున్నారు. అనంతరం తాము చదువుకున్న పాఠశాలను చూసి ఎంతో అభివృద్ధి చెందిందని కొనియాడారు. తమకు పాఠాలు చెప్పిన గురువులు వేదికపై లేకపోవడం బాధాకరమని, అభివృద్ధి కోసం తమ వంతు కృషిగా పాటుపడతామన్నారు.