ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపునకు సిపిఎం శ్రేణులు, సిపిఎం పార్టీకి చెందిన పట్టభద్రులైన ఓటర్లు కృషి చేయాలని సిపిఎం మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
దశాబ్దకాలం పాటు నిరుద్యోగులను అన్ని రకాలుగా మోసం చేసిన బిజెపి, టిఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పే అవకాశం నిరుద్యోగులకు ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా లభించిందని విద్యావంతులైన నిరుద్యోగులు, ఉద్యోగులు ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి, టిఆర్ఎస్ పార్టీ లను చిత్తుగా ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న ను గెలిపించాలని కోరారు. మల్లన్న గెలుపుకు మండలంలోని సిపిఎం పార్టీ శాఖల పరిధిలోని స్దానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి అధిక మోజార్టీతో గెలిచేందుకు కృషి చేయాలని కోరారు.