Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: భక్తుల ఉచిత సేవలకు అందుబాటులో టోల్ ఫ్రీ నెంబర్లు

Srisailam: భక్తుల ఉచిత సేవలకు అందుబాటులో టోల్ ఫ్రీ నెంబర్లు

శ్రీశైలం మహా క్షేత్రంలో శివరాత్రి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకొని 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి చెప్పచ్చని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ తెలిపారు. భక్తులు త్రాగునీరు, వైద్య సదుపాయం, ట్రాఫిక్ తదితర అత్యవసర సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్లు 08524-287004, 08524-287288, 08524-287289 లకు ఫోన్ చేసి సమాచారం అందిస్తే తదుపరి చర్యలు తీసుకొంటామని కలెక్టర్ తెలిపారు. భక్తులు అసౌకర్యానికి గురైనా, పాదయాత్రలో అవాంతరాలు ఏర్పడినా, బంధు మిత్రులు తప్పిపోయినా, ప్రమాదవశాత్తు వైద్య సహాయం తదితర అత్యవసర సేవల నిమిత్తం టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేస్తే సంబంధిత శాఖలకు సమాచారాన్ని చేరవేసి అవసరమైన సహాయాన్ని అందించేందుకు వీలుగా సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. భక్తులు అసౌకర్యానికి గురైనప్పుడు అందుబాటులో ఉన్న టోల్‌ఫ్రీ నంబర్లు వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News