Saturday, October 5, 2024
HomeతెలంగాణNarayana rocking in K-CET too: K-CET 2024 ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్...

Narayana rocking in K-CET too: K-CET 2024 ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ నారాయణ ప్రభంజనం

విద్యారంగ అగ్రగామిగా నారాయణ

నారాయణ సంస్థలు కే-సెట్ లోనూ తమ సత్తా చాటుతూ ప్రభంజనం సృష్టించాయి. తాజాగా విడుదలైన కే-సెట్ ఫలితాల్లో ..1, 2, 2, 2, 2, 3, 3, 4, 4, 4, 4, 6, 6, 7, 7, 9, 9, 10, 10, 105, 19 ర్యాంకులు నారాయణవే కావటం హైలైట్.

- Advertisement -

కాగా.. కే-సెట్ లోని అన్ని విభాగాల్లో 100 లోపు 92 ర్యాంకులు, 1000 లోపు మొత్తం 399 ర్యాంకులు నారాయణవే కావటం విశేషం.

విద్యారంగ అగ్రగామి నారాయణ మళ్ళీ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కెసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో నారాయణ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభతో కదంతొక్కారు.

కే-సెట్లో స్టేట్ 1, 2, 2, 2, 2, 3, 3, 4, 4, 4, 4, 6, 6, 7, 7, 9, 9, 10, 10 వంటి 10 లోపు 19 అత్యుత్తమ ర్యాంకులతో 100లోపు 92 ర్యాంకులు కైవశం చేసుకుని నారాయణ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. అలాగే వివిధ కేటగిరీల్లో రెండు విభాగాల్లో 1000 లోపు 399 అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకుని నెం.1 స్థానం కైవసం చేసుకుందని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డా. పి. సింధూర నారాయణ, పి. శరణి తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ నారాయణ విజయప్రస్థానం నిరంతరాయంగా కొనసాగుతోందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కెసెట్ ఫలితాలలో ఇంజినీరింగ్, మెడికల్ విభాగాలలో స్టేట్ టాప్ ర్యాంకులు కైవసం చేసుకొని చరిత్ర నెలకొల్పామన్నారు. నారాయణ కాలేజీలు PU, JEE – MAIN, ADVANCED, COMED-K ‎‫م‬‎ సాధించినట్లు పేర్కొన్నారు. అలాగే జాతీయ స్థాయిలో నిర్వహించే NEETకు అత్యుత్తమ ప్రణాళికతో బోధన అందిస్తున్నట్లు తెలిపారు. తద్వారా నీట్ లోనూ ది బెస్ట్ ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు.

ఇంతటి ఘన విజయాలను సాధించడానికి కారణాలను విశ్లేషిస్తూ ఇంటిగ్రేటెడ్ సిలబస్ తో, ప్రణాళికను అనుసరించి రూపుదిద్దిన మైక్రోషెడ్యూల్, ఎక్స్పర్ట్స్్చ రూపొందించిన స్టడీమెటీరియల్, అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన, రోజువారి టెస్ట్లు, వాటిపై సమగ్ర విశ్లేషణతో బలహీనతలను అధిగమిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకుపోయేలా ప్రతి విద్యార్థిని తయారు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. అలాగే నారాయణ విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. పునిత్ మాట్లాడుతూ కర్ణాటకలో ఇంతటి ఘన విజయం సాధించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. విజయం సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే విధంగా కర్ణాటకలోని అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నారాయణ విద్యార్థులు టాప్ ర్యాంకులు కైవసం చేసుకునేలా జాగ్రత్త వహిస్తున్నట్లు తెలిపారు. ఇక ముందు అధిక స్థాయి ఫలితాలు సాధించేందుకు నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులను అభినందించారు. వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News