Sunday, October 6, 2024
HomeతెలంగాణBhimadevarapalli: ఐదేళ్ల తర్వాత తెరుచుకున్న స్కూల్

Bhimadevarapalli: ఐదేళ్ల తర్వాత తెరుచుకున్న స్కూల్

హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు

ఐదేళ్ల తరువాత అక్కడ స్కూల్ ఓపన్ అవ్వటం హైలైట్. భీమదేవరపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలో ఐదేళ్ల క్రితం మూసేసిన బడి ఎట్టకేలకు పునః ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి గ్రామ పంచాయితీలో ప్రభుత్వ పాఠశాల ఉండేటట్లు చేస్తానని చెప్పిన హామీ మేరకు విద్యాధికారులు గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలకు జి. శ్యామల ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని డిప్యూటేషన్ పై కేటాయించారు. ఉపాధ్యాయులు నన్నెబోయిన తిరుపతి, జి .శ్యామల గ్రామంలోని ముఖ్యులను, యువకులను, మహిళలను కలిసి పాఠశాల పునః ప్రారంభ విషయాలను, బడుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు.

- Advertisement -

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామని, ఆంగ్లంలో విద్యా బోధన చేస్తామని, గ్రామంలోని బడికి వెళ్ళే వయస్సు ఉన్న పిల్లలందరినీ గొల్లపల్లి ప్రభుత్వ పాఠశాలకే పంపాలని కోరారు. విద్యార్థుల సంఖ్య పెరిగితే శాశ్వత ప్రాతిపదికన ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించే అవకాశం ఉందని తల్లిదండ్రులకు తెలియజేశారు. తల్లిదండ్రుల నుండి మంచి స్పందన వచ్చింది.

15 మంది వరకు పిల్లలు పాఠశాలలో ప్రవేశానికి సిద్ధంగా ఉన్నట్లుగా తల్లితండ్రులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నేతుల సంపత్ ,కన్నెబోయిన రాజయ్య, చొప్పరి నవీన్,కన్నెబోయిన కొమురయ్య ,ఎల్ది ఐలయ్య ,పూదరి రాజమల్లు, మేకల ప్రవళిక, ఎల్దీ కోమల ,ఎల్ది హైమావతి, కూన రాధ,మేకల రేణుక,మేకల చిన్న లక్ష్మి , అంగన్వాడీ టీచర్ అరుణ, ఆయా స్వప్న తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News