చెన్నూర్ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల వైద్య సేవలు మెరుగవనున్నట్లు ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. నియోజకవర్గంలోని అంగ్రాజుపల్లి, సోమన్ పల్లి, కుందారం, శెట్పల్లి, పిన్నారం ఇందారం, ఆల్గావ్, కత్తెరశాల గ్రామాల్లో సబ్ హెల్త్ సెంటర్ల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్టు..ప్రతి భవనానికి 20 లక్షల చొప్పున 1.60 కోట్లు కేటాయింపు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. వైద్యం కోసం ఎవరు జిల్లా కేంద్రంలోని ప్రైవేటు దవాఖానాలకు వెళ్లకుండా అత్యంత ఆధునిక వసతులతో ఈ హెల్త్ సబ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఎనిమిది హెల్త్ సబ్ సెంటర్లకు నిధుల మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.