నీట్ 2024 పరీక్ష ఫలితాలపై పరీక్ష ఫలితాల అవకతవకలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని పి.డి.ఎస్.యూ గార్ల మండల ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకై ఫలితాల్లో స్కామ్ జరిగినట్లుగా దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆరోపిస్తున్నరాని, ఒకే పరీక్ష కేంద్రంలో ఆరుగురు విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని , ఒక్కో పరీక్ష పత్రం లీకేజీలో లక్షల రూపాయలు చేతులు మారాయని,
లక్షలాదిమంది జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని, ఓకే పరీక్ష కేంద్రంలో 67 మందికి ఎలా టాప్ ర్యాంకులు ఎలా వస్తాయని, సుప్రీంకోర్టులో కూడా పలు పిటిషన్లు దాఖలు అయ్యాయని ,
నీట్ పరీక్ష ఫలితాలు జూన్ 14న విడుదల చేయాల్సింది ఎన్నికల ఫలితాల రోజే 4 న ఎందుకు విడుదల చేశారని వీటన్నిటిని చూస్తే ఫలితాల్లో స్కామ్ జరిగిందని స్పష్టంగా అర్థం అవుతుందని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. లేనియెడల పిడిఎస్ యూ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని డిమాండ్ చేశారు.
Garla: నీట్ 2024 ఫలితాల అవకతవకలపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి
పీడీఎస్యూ డిమాండ్