కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీ లలో భాగమైన ఉచిత కరెంటు, గ్యాస్ సబ్సిడీ లను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలని సిపిఎం మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీ లలో కొన్ని గృహాజ్యోతి, గ్యాస్ సబ్సిడీకి దరఖాస్తులు తీసుకున్నప్పటికీ సంబంధిత అధికారులు ఆన్ లైన్ నిర్లక్ష్యం చేయడం వలన చాలా మందికి యథావిధిగా విద్యుత్ బిల్లులు వస్తుండటంతో లబ్ధి దారులు లబోదిబో మంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు. గ్యాస్ సబ్సిడీ లో సంబంధిత డిలర్ల బాధ్యత రహితం వలన గ్యాస్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వకపొవడం వలన గ్యాస్ సబ్సిడీ కొరకు దరఖాస్తులు పెట్టినప్పటికీ వందలాది మంది లబ్ధిదారులకు సబ్సిడీ ఎమౌంట్ పడకపోవడం వలన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అందోళన వ్యక్తం చేశారు. గతంలో గ్యాస్ సబ్సిడీ, ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తులు చేసుకున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వలన లబ్ధిదారులు గ్యాస్ సబ్సిడీ కి,ఉచిత విద్యుత్ కు దూరం అవుతున్నారని తక్షణమే జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి అయా కార్యాలయాలలో ప్రత్యేక కౌంటర్ లు ఏర్పాటు చేసి ఆన్ లైన్ ప్రక్రియ ను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు మాఫి చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి,నూతనంగా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను తక్షణమే అమలు చేయాలని లేని పక్షంలో రైతులు, ప్రజలను సమీకరించి దశల వారీగా అందోళనలు చేపడతామని హెచ్చరించారు.