Saturday, April 5, 2025
HomeతెలంగాణJadcharla: రేపు జడ్చర్ల బంద్ కు పిలుపు

Jadcharla: రేపు జడ్చర్ల బంద్ కు పిలుపు

పార్టీలకతీతంగా బంద్

రేపు సోమవారం పట్టణ బందుకు జడ్చర్ల హిందూ ధార్మిక సంఘాలు, శ్రీ రంగనాయక స్వామి ఆలయ పరిరక్షణ కమిటీ పిలుపునిచ్చాయి. శ్రీ రంగనాయక దేవాలయ పరిరక్షణ కమిటీ సభ్యులు, హిందూ ధార్మిక సంఘాల సభ్యులు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని బాదేపల్లి పెద్దగుట్టపై గల శ్రీ రంగనాయక స్వామి ఆలయ కోనేరు మూసివేత, తదితర పరిసరాలను ధ్వంసం చేసినందుకు నిరసనగా పట్టణ బందును ప్రకటిస్తున్నట్లు, పట్టణ బంద్ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం 9 గంటలకు పాత బజార్ హనుమాన్ దేవాలయం నుండి జరిగే ర్యాలీలో పట్టణ ప్రజలు, పెద్దలు, యువకులు, భక్తులు, పార్టీలకతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని, పట్టణ బంద్ కు ప్రజలందరూ సహకరించాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News