Saturday, July 13, 2024
Homeట్రేడింగ్South India Shopping Mall: అనుపమ చేతుల మీదుగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 34వ...

South India Shopping Mall: అనుపమ చేతుల మీదుగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 34వ బ్రాంచ్

ఖాజగూడలో 34 వ షోరూమ్ కు శుభారంభం చేసిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్

- Advertisement -

తమ అభిమాన కస్టమర్ల జీవన శైలిలో వస్తున్న మార్పులకు అనుగుణమైన షాపింగ్ అవసరాలను తీర్చే దిశగా  సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారు హైదరాబాద్ ఖాజగూడలో తమ  34 వ షోరూమ్ ప్రారంభిస్తున్న సంతోషకర వార్తను ఈ ప్రకటన మూలంగా తెలియజేస్తున్నారు. కుటుంబంలోని అన్ని తరాల వారి అభిరుచులను దృష్టిలో ఉంచుకుని వైవిధ్య భరిత వస్త్ర శ్రేణిని అందుబాటులోకి తీసుకు వచ్చి , ఆహ్లాదకరమైన షాపింగ్ అనుభూతిని అందించే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారి ఈ సరికొత్త షో రూమ్ ను ప్రముఖ టాలీవుడ్ తార కుమారి అనుపమ పరమేశ్వరన్ జులై 7వ తేదీ నాడు శుభారంభం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ..“ఖాజాగూడ లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారి 34 వ షోరూమ్-  ఇక్కడ స్థానికంగా నివసిస్తున్నఅన్ని తరాల, తరగతుల కుటుంబ సభ్యుల  అభిరుచులకు అనుగుణమైన షాపింగ్  అవసరాలను తీర్చగలదని ఆశిస్తున్నాను. ఖాజాకూడా వాసులు పండగలకు , శుభకార్యాలకు ఇక్కడికి విచ్చేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారి విక్రయ సేవలను, అత్యంత ఆకర్షణీయమైన- ‘ ఆషాఢమాసం నంబర్ 1 కిలో సేల్’, ‘అన్ని రకాల వెరైటీ వస్త్రాలపై 66 శాతం వరకు డిస్కౌంట్’ వంటి ఆఫర్లను తప్పక  వినియోగించుకోగలరని  ఆకాంక్షిస్తున్నాను” అన్నారు.

విస్తృత షాపింగ్..

అనంతరం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డైరెక్టర్ సురేశ్ శీర్ణ మాట్లాడుతూ తమ అభిమాన కస్టమర్ల  విస్తృత షాపింగ్ అవసరాలను, వారి సంపూర్ణ సంతృప్తిని  దృష్టి లో ఉంచుకుని  తమ సంస్థ ప్రవేశ పెడుతున్న వివిధ రకాల ఆఫర్లు,  వైవిధ్య భరిత వస్త్రాభరణ శ్రేణి, తెలుగు రాష్ట్రాలలో చేపట్టబోతున్న భావి విస్తరణ మొదలైన అంశాలను మీడియా వారికి వివరించారు.  ప్రతీ అంశాలలోనూ నాణ్యతకు , విశ్వసనీయతకు పెద్ద పీట వేస్తూ, అంకిత భావంతో కృషి  చేయటం , పోటీ ధరలతో వస్త్రాభరణాలను అందించటం లో ముందుండటం తమ సంస్థ ధ్యేయమని శ్రీ సురేశ్ పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను , వివిధ రకాల పండగలు, శుభాకార్యాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు సరికొత్తగా ఆషాఢం కిలో సేల్ ను ప్రారంభించామని అన్నారు. మరో డైరెక్టర్ అభినయ్ మాట్లాడుతూ ప్రత్యేకంగా నైపుణ్యానికీ, నాణ్యత కు పేరెన్నికగన్న కంచి, ధర్మవరం, అరణి, ఉప్పాడ, పోచంపల్లి, గద్వాల మొదలైన వెరైటీల తో కూడిన  తమ కళాత్మక  పట్టు వస్త్రాల విభాగం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.  సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డైరెక్టర్ రాకేశ్ వివరిస్తూ.. జంట నగరాల్లోని ఫ్యాషన్ స్టోర్స్ లో  కెల్లా అతి పెద్దదైన తమ ఖాజగూడ షో రూమ్ ప్రత్యేకత గురించి, అందులో లభించే  విస్తృత శ్రేణికి చెందిన మెన్స్ వేర్, అధునాతన  బ్రాండ్స్, వాటి పై లభించే  స్పెషల్ ఆఫర్ల గురించి వివరిస్తూ, రాబోయే పండగలు, పెళ్ళిళ్ళ సీజన్లలో విస్మయం గొలిపే పథకాలను అందించబోతున్నామని చెప్పారు. మరో డైరెక్టర్ కేశవ్ – మహిళల అభిరుచులకు తగిన సరికొత్త ఫ్యాషన్లను, డిజైన్లను   తమ షోరూమ్ అందుబాటులో ఉంచిందని అన్నారు. చుడిదార్ , లెహంగాస్, లెగ్గింగ్స్, కిడ్స్ వేర్,  లేడీస్ వెస్ట్రన్ వేర్, లేటెస్ట్ ఫ్యాషన్స్ కి చెందినా అన్నిరకాల ట్రెండీ  బ్రాండ్స్  కోసం ఖాజాగూడ మహిళలు తమ షో రూమ్ కి విచ్చేయాల్సిందని కోరారు. రానున్న పర్వదినాల సందర్భంగా ఖాజా గూడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిర్వాహకులు తమ వినియోగ దారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News