Sunday, October 6, 2024
HomeతెలంగాణGarla: అర్హులైన పేదలందరికీ గ్యాస్, విద్యుత్ సబ్సిడీ ఇవ్వాల్సిందే

Garla: అర్హులైన పేదలందరికీ గ్యాస్, విద్యుత్ సబ్సిడీ ఇవ్వాల్సిందే

గ్యాస్, విద్యుత్ సబ్సిడీలకు గతంలో దరఖాస్తులు చేసుకుని అధికారుల నిర్లక్ష్యం వలన సబ్సిడీకి దూరమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్ అధికారులను డిమాండ్ చేశారు. గతంలో నిర్వహించిన ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకొని అధికారుల తప్పిదం వలన రిజక్ట్ అయి సబ్సిడీకి దూరం అయిన లబ్ధిదారులకు న్యాయం చేయాలని సిపిఎం అధ్వర్యంలో తహశీల్దారు కార్యాలయం ఎదుట అందోళన నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో 500 రూపాయలు గ్యాస్ సబ్సిడీకి, 200 యూనిట్లు గృహజ్యోతి క్రింద ఉచితంగా అందిస్తామని చేసిన వాగ్దానం లో భాగంగా ప్రజల నుండి దరఖాస్తు లు తీసుకున్నారని చెప్పారు. కానీ దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల దరఖాస్తులను ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్ లకు ఆన్ లైన్ చేసేందుకు అప్పగించగా వారు చేసిన తప్పిదం కారణంగా దాదాపుగా సగం మంది లబ్ధిదారులు సబ్సిడీ కి దూరం అయ్యారని ఆవేదన వెలిబుచ్చారు.

గతంలో దరఖాస్తులు చేసుకుని అధికారుల తప్పిదం కారణంగా సబ్సిడీకి దూరం అయిన లబ్ధిదారులు మరలా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాల చూట్టూ, గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారని అందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ సబ్సిడీకి కోసం గ్యాస్ కనెక్షన్ ఐడి నెంబరు కావాల్సి ఉండగా ఇల్లందు హెచ్ పి గ్యాస్ ఏజెన్సీ కార్యాలయంకు రోజు వందలాది ఫోన్ లు చేస్తున్న లిప్ట్ చేయడం లేదని వాపోయారు.

తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి గ్యాస్, విద్యుత్ సబ్సిడీకి దరఖాస్తు చేసుకుంటున్న లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక కౌంటర్ ల ద్వారా దరఖాస్తులు స్వీకరించి ఆన్ లైన్ చేయాలని, హెచ్ పి గ్యాస్ ఏజెన్సీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తహశీల్దారు రవీందర్ కు వినతి పత్రం అందించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు భూక్య హరి నాయక్, మండల నాయకులు వి.పి వెంకటేశ్వర్లు, సిహెచ్. ఎల్లయ్య, కె.రామకృష్ణ, అన్నం శ్రీనివాసరావు, యం.అశోక్,వీరన్న, కొండయ్య, రాంబాబు, కోటయ్య, కొండల్ రావు, పుల్ సింగ్, ఉపేందర్ ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News