అభినవ జ్యోతి స్లమ్ సమైక్య ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ 32 డివిజన్ లో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం సందర్భంగా సమైక్య మహిళలకు మొక్కలను పంపిణీ చేసిన డివిజన్ కార్పొరేటర్.
- Advertisement -
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… చెట్లను పెంచడం ద్వారా పచ్చదనంతో ఎంతో ఉల్లాసంగా ఉంటుందని, చెట్లు నాటడంతో మనిషి జీవనానికి ఎంతో ఉపయోగపడతాయని, చెట్ల ద్వారా వచ్చే గాలి స్వచ్ఛమైనదని ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని అన్నారు. ప్రతి ఒక్కరు చెట్లు నాటాలన్నారు. వన మహోత్సవంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని వారికి సూచించారు.