Friday, October 18, 2024
HomeదైవంSrisailam: కనకదుర్గమ్మ అమ్మవారికి శ్రీశైల దేవస్థానం తరుపున సారె సమర్పణ

Srisailam: కనకదుర్గమ్మ అమ్మవారికి శ్రీశైల దేవస్థానం తరుపున సారె సమర్పణ

ఆషాఢ మాసం సందర్భంగా ..

ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీకనకదుర్గ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా శ్రీశైల దేవస్థానం తరుపున సారె సమర్పించారు. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ కార్యక్రమములో అమ్మవారికి పట్టుచీర, పూలు, పలు రకాల ఫలాలు, గాజులు మొదలైనవి సమర్పించారు. అదేవిధంగా శ్రీమల్లేశ్వరస్వామి వారికి కూడా పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ మేరకు శ్రీశైల దేవస్థానం దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు దంపతులు, అమ్మవారి ప్రధానార్చకులు పి. మార్కండేయశాస్త్రి, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు, అర్చకులు, వేదపండితులు పోలేపెద్ది వెంకట సుబ్రహ్మణ్యం, సంబంధిత సిబ్బంది ఈ సారెను సమర్పించారు.

- Advertisement -

కాగా సారెతో కనకదుర్గ అమ్మవారి ఆలయానికి చేరుకున్న వీరికి దుర్గామల్లేశ్వర దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.ఎస్. రామారావు, సంబంధిత అధికారులు, అర్చకులు, వేదపండితులు తదితరులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం దేవస్థానం తరుపున అమ్మవారికి సారె, స్వామివార్లకు వస్త్రాలు సమర్పించారు. తరువాత ఈ దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు దంపతులను శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి
దేవస్థానం వారు వేదాశీర్వచనంతో శేషవస్త్రాలు, ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. చివరగా ఈ దేవస్థానం తరుపున కూడా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం వారికి శేషవస్త్రాలు, ప్రసాదాలను కూడా అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News