సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి కుటుంబ సమేతంగా తొలి బోనాన్ని సమర్పించి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం అమ్మవారికి పూజలు చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ..
ఆషాఢ మాస ప్రతిష్టాత్మకమైన బొనాల్లో భాగంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తామనిస అందరికి కూడా హృదయపూర్వకంగా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నా అన్నారు. సకాలంలో మంచి వర్షాలు పడి పంటలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నట్టు ఆయన తెలిపారు. హైదరాబాద్ జంట నగరంలోనే కాకుండా వందప సంవత్సరాలు నుండి సంస్కృతి సాంప్రదాయాలతో ఈ బోనాలు ఉత్సవాలు జరుగుతున్నాయని, ఇలాంటి అవాంతరాలు జరగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.
ఈ రోజు ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర బోనాలు, 28వ తేదీ లాల్ దర్వాజా బోనాలు, తర్వాత రంగం, అంబారీ ఊరేగింపు అన్ని కార్యక్రమాలు విజయవంతం కావడానికి స్థానిక ప్రజలు సహకారం కావాలన్న పొన్నం, మహిళలు మహాలక్ష్మి పథకం ద్వారా భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు.
హైదరాబాద్ ప్రజలంతా వారికి ఆతిథ్యం ఇచ్చే విధంగా పండగ విజయవంతం అయ్యేవిధంగా సహకరించాలని, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న ప్రజల సహకారం ఎంతో అవసరం అందరికీ శుభం జరగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నా అన్నారు మంత్రి పొన్నం.