Saturday, November 23, 2024
HomeతెలంగాణNanpur-National Award to Singareni: ఆర్కే 5 గనికి జాతీయస్థాయి అవార్డు

Nanpur-National Award to Singareni: ఆర్కే 5 గనికి జాతీయస్థాయి అవార్డు

దేశవ్యాప్తంగా బొగ్గు గనులకు ఇచ్చే జాతీయస్థాయి అవార్డు సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ డివిజన్ లోని రవీంద్ర ఖని(ఆర్.కే)-5వ గని అవార్డ్ అందుకుంది. కలకత్తాలో ఆదివారం జాతీయస్థాయి అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. మైన్ సేఫ్టీ అవార్డు 2024 కింద సింగరేణి లోని ఆర్కే 5 గనికి ‘కోల్ అండర్ గ్రౌండ్ స్మాల్ క్యాటగిరి ‘ కింద  అవార్డు దక్కింది. ఈనెల 19న తనిఖీ బృందం విచ్చేసి ఆర్కే 5 గనిని సందర్శించి  పని పద్ధతులు, రక్షణలో ఆర్కే5 గని ఉద్యోగులు పాటిస్తున్న ఎస్ ఓ పి లు మరియు సంబంధిత రికార్డులను తనిఖీ చేయడం జరిగిందని, ఆర్కే 5 గని అధికారులు, ఉద్యోగులు రక్షణ పట్ల వారు అనుసరిస్తున్న విధానాల పట్ల తనిఖీ బృందం వారు హర్షితులయ్యారు.తద్వారా తనిఖీ బృందం ఆర్కే5గనిని మొదటి స్థానం కొరకు సిఫార్సు చేయడం జరిగిందని, అలాగే ఆర్కే5 గనికి భారతదేశంలోనే ‘కోల్ అండర్ గ్రౌండ్ స్మాల్ క్యాటగిరి’ మొదటి స్థానం రావడం జరిగింది.

- Advertisement -

ఈ అవార్డును సింగరేణి సంస్థ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ జి.వెంకటేశ్వర్ రెడ్డి (జీవీ రెడ్డి), గని మేనేజర్,డీవై జీఎం ఎండీ. అబ్దుల్ ఖాదీర్, మైనింగ్ డీ.జీ.ఎం.ఎస్ ప్రభాత్ కుమార్, చేతుల మీదుగా అవార్డ్ అందుకున్నారు. సింగరేణి సంస్థకు అవార్డు దక్కడం పట్ల సీ అండ్ ఎండీ నునావత్ బలరాం,డైరెక్టర్ లు ఎన్ వి కే శ్రీనివాస్ (ఆపరేషన్స్ & పా),డీ. సత్యనారాయణ రావు(ఈ&ఎం), తెలంగాణ ప్రాంతానికి చెందిన కోల్ ఇండియా టెక్నికల్ డైరెక్టర్ బి.వీరారెడ్డి, శ్రీరాంపూర్ డివిజన్ జీఎం సంజీవ రెడ్డి, గని ఏజెంట్ ఏ.వి.రెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News