Saturday, November 23, 2024
Homeచిత్ర ప్రభHansika Marriage : హన్సిక ఇంట్లో మొదలైన పెళ్లి సందడి..

Hansika Marriage : హన్సిక ఇంట్లో మొదలైన పెళ్లి సందడి..

- Advertisement -

Hansika Marriage : చిన్నవయసులోనే హీరోయిన్ అయి స్టార్ హీరోలందరితో దాదాపు అన్ని భాషల్లో నటించిన యాపిల్ బ్యూటీ హన్సిక ఇటీవలే 50 సినిమాలకి చేరువైంది. కొన్ని రోజుల క్రితమే హన్సిక తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపి తన కాబోయే భర్తతో ఈఫిల్ టవర్ దగ్గర దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హన్సికకి కాబోయే వరుడు హన్సిక స్నేహితురాలికి మాజీ భర్త కావడం విశేషం.

హన్సికకి కాబోయే భర్త సోహైల్ కతూరియా బిజినెస్ మెన్. గతంలోనే ఒక మ్మాయిని పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చాడు. ఆ అమ్మాయికి హన్సిక స్నేహితురాలు అవ్వటంతో వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. హన్సిక స్నేహితురాలికి విడాకులు ఇచ్చాక సోహైల్ హన్సికని పెళ్లి చేసుకోడానికి రెడీ అయ్యాడు. ఈ పెళ్ళికి ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయి.

తాజాగా హన్సిక పెళ్లి పనులు మొదలయ్యాయి. పెళ్లిపనులు మొదలుపెట్టడానికి మాతా కీ చౌకీ అనే ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ముంబైలో హన్సిక నివాసంలో ఈ కార్యక్రమం ఇరు కుటుంబాల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో హన్సిక రెడ్ శారీలో మెరిసిపోయింది. డిసెంబర్ 4న వీరి పెళ్లి జరగబోతున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News