పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందని సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గార్ల మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి కిషన్ అన్నారు.
గార్ల మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీ సినిమా హాల్ బజార్ లో కార్యదర్శి కిషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీధులలోని ఇండ్లల్లో నిల్వ ఉన్న మురుగు నీటిలో, సైడ్ డ్రైనేజీలలో దోమల నివారణకు బ్లీచింగ్ పౌడర్ చల్లారు. పాడుపడ్డ కూలర్లు, కుండలు, గాబులు, టైర్లలో నీరు నిల్వ లేకుండా బోర్లించారు.
ప్రతి ఇంటికీ వెళ్లి జ్వరం, దగ్గు, జలుబు అనారోగ్య సమస్యలతో ఎవరైనా బాధపడితే తమకు సమాచారం ఇవ్వాలని బజార్ వాసులకి తెలిపారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి కిషన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తడిపొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది పిడమర్తి దాసు సతీష్ ప్రేమ్ కుమార్ వైద్య సిబ్బంది పద్మ పార్వతి శాంత విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.