Friday, September 20, 2024
HomeతెలంగాణSCR celebrates I-day: స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న దక్షిణ మధ్య రైల్వే

SCR celebrates I-day: స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న దక్షిణ మధ్య రైల్వే

• స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఎగురవేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్

- Advertisement -
దక్షిణ మధ్య రైల్వే 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఈ రోజు అనగా  ఆగస్టు 15 , 2024న   సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంగణంలో ఘనంగా జరుపుకున్నది.  ఈ సంధర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు.  ఈ వేడుకల్లో రైల్వే సీనియర్  అధికారులు,  సిబ్బంది,  రైల్వే కుటుంబ సభ్యులతో పాటు రైల్వే పాఠశాల రైల్వే కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రైల్వే మిక్స్‌డ్ హైస్కూల్ & రైల్వే జూనియర్ కాలేజీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాన్ని, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండో షోను వీక్షికులను అబ్బురపరిచే విధంగా ప్రదర్శించారు. 

అరుణ్ కుమార్ జైన్ భారతదేశ 78 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జనరల్ మేనేజర్ తన ప్రసంగంలో, భారతదేశం స్వతంత్ర దేశంగా మారడానికి ఎన్నో త్యాగాలు చేసిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధులను ఈ సందర్భముగా స్మరించుకున్నారు.


అరుణ్ కుమార్ జైన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జోన్ ప్రదర్శించిన అత్యుత్తమ విజయాలను తెలియజేస్తూ , ఏప్రిల్ – జూలై 2024 మధ్య దక్షిణ మధ్య రైల్వే రూ.6894 కోట్లస్థూల ఆదాయాన్ని ఆర్జించిందని గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 3% పెరుగుదలను సూచిస్తున్నదని తెలిపారు. జోన్ జూలై వరకు 46.25 మిలియన్ టన్నుల సరుకు రవాణాను నమోదు చేసిందని, సరుకు రవాణా విభాగంలో రూ.4611 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని అన్నారు. అదే విధంగా ఏప్రిల్-జూలై 2024 మధ్య 88 మిలియన్ల ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చి రూ. 1956 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని పేర్కొన్నారు.
జనరల్ మేనేజర్ జోన్ రైలు కార్యకలాపాల భద్రత విషయంలో ఏక్కడా రాజీ పడకుండా అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని తదనుగుణంగా 2024 ఏప్రిల్-జూలై మధ్య 251 కిలోమీటర్ల మేరకు ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తిచేసిందని ఆయన చెప్పారు. వర్షాకాలం దృష్ట్యా ప్రతికూల పరిస్థితులను సమర్ధవంతంగా ఎదురుకోవడానికి, సమస్యాత్మక ప్రదేశాలు వంతెనల వద్ద ముందస్తు భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, జోన్ వ్యాప్తంగా “కవచ్” విస్తరణలో భాగంగా, వాడి – గుంతకల్ – రేణిగుంట మధ్య 523 కి.మీ దూరం వరకు టెండర్లు పిలిచామన్నారు.

రక్షణ విషయంలో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే రక్షణ దళం 503 మంది చిన్నారులను రక్షించారని , రూ. 1 కోటి విలువైన దొంగిలించబడిన వస్తువులను రికవరీ చేయటంతోపాటు 918 వేర్వేరు సందర్భాలలో సుమారు రూ 2 కోట్ల విలువైన పోగొట్టుకున్న సామానును తిరిగి గుర్తించి, ప్రయాణికులకు అప్పగించారని తెలియజేశారు.
అరుణ్ కుమార్ జైన్ దక్షిణ మధ్య రైల్వేలోని మరో కీలకమైన అంశం మౌలిక సదుపాయాల అభివృద్ధి అని తెలియజేస్తూ జోన్ నెట్‌వర్క్‌కు గత సంవత్సరంలో రికార్డు స్థాయిలో 415 కిలోమీటర్ల ట్రాక్ జోడింపును కొనసాగిస్తూ, ఈ ఆర్థిక సంవత్సరంలో55 కిలోమీటర్ల మూడవ లైన్ పనులను పూర్తి చేసిందని, దక్షిణ మధ్య రైల్వే నెట్‌వర్క్ లో దాదాపు అన్ని ముఖ్యమైన మార్గాలకు విస్తరిస్తూ 93 శాతం విద్యుదీకరణ పూర్తయిందని పేర్కొన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద, పునరాభివృద్ధి కోసం గుర్తించిన 119 రైల్వే స్టేషన్లలో రూ. 6243 కోట్ల అంచనా వ్యయంతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

సెలవులు, వేసవి కాలంలో ప్రయాణీకుల సౌకర్యార్ధం అదనపు రద్దీ అవసరాలను తీర్చడానికి జూలై వరకు 271 ప్రత్యేక రైళ్లు నడపటంతోపాటు 3866 అదనపు కోచ్‌లు ముఖ్యమైన రైళ్లకు జోడించినట్లు జనరల్ మేనేజర్ తెలియజేశారు. అదనంగా, ఇంధన పొదుపు రంగంలో వేగంగా అడుగులు వేయడంలో దక్షిణ మధ్య రైల్వే ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని, ఈ దిశలో భాగంగా జోన్ లోని 7 స్టేషన్లలో 896 కె.డబ్లు.పి. రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను ప్రారంభించామన్నారు.
.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News