Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Govt failures: ప్రభుత్వాల పాపం, ప్రజలకు శాపం

Govt failures: ప్రభుత్వాల పాపం, ప్రజలకు శాపం

పాకిస్థాన్‌కు, అంతర్జాతీయ ద్రవ్యానికి మధ్య చర్చలు అసంపూర్తిగా మిగలడంతో ఆర్థికంగా పాక్‌ దివాలా దిశలో ఉంది. ద్రవ్యోల్బణం దేశప్రజల జేబులకు చిల్లులు పెడుతోంది. కనీసం చపాతీలు చేసుకునేందుకు అవసరమయ్యే గోధుమ పిండి కూడా ఆకాశం వైపు చూస్తుంటే ప్రజలు తమ బాధల్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో కునా రిల్లుతున్నారు. దీనికి తోడు గతేడాది పాక్‌లో సంభవించిన వరదలు కనీవినీ ఎరుగని స్థితిలో రావడం పుండుమీద కారం జల్లినట్లయింది. ముందుచూపు లేకపోవడం ఒక కారణమైతే వాలా తీసేందుకు పాక్‌ సిద్ధంగా ఉందనడానికి ప్రధాన కారణం ఆ దేశంలో సుస్థిర ప్రభుత్వం లేకపోవడం ప్రధాన కారణం. అదీగాక అగో దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిందని మురిసిపోయేలోపే సైనికులు ప్రభుత్వాన్ని కూల్చి వేస్తుండడంతో అక్కడ సైనిక ప్రభుత్వాలే దీర్ఘకాలం మనుగడ సాగించాయి. సైనికుల చేతుల్లోకి ప్రభుత్వాలు వెళ్తే సైనిక పాలకులకు సైన్యమే కనిపిస్తుంది గానీ ప్రజలు. వారి అవసరాలపై పెద్దగా శ్రద్ధ చూపరు. ఇది సహజంగా జరిగేదే! అదీగాక సైనికపాలనలో ప్రజావసరాల కోసం బడ్జెట్లనేవి ఉండవు. అన్నీ సైనికా వసరాల కోసమో లేక కొత్తకొత్త ఆయుధాలను సమకూర్చుకునేందుకో పద్దులో అధిక కేటా యింపులుంటాయి. అంతేగానీ ప్రజల కోసం ప్రజల తరపున బడ్జెట్‌లో కేటాయింపు లుండవు. స్వాతంత్య్రం లభించిన దగ్గర నుంచి పాక్‌లో ఇదే పరిస్థితి. పొరుగున ఉన్న దాయాది దేశాన్ని 1948 నుంచి శత్రువుగానే చూడడం, ఎంతసేపూ కశ్మీర్‌ను ఎలా ఆక్ర మించుకుందామనే దుగ్ధ ఆ దేశ రాజకీయాలకు శాపంగా మారిం. అయితే ఒక విషయంలో మాత్రం అటు సైనిక పాలకులు, ఇటు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పాలకులు ఒకే పల్లవి అందుకుంటారు. దేశంలో ఎన్నో సమస్యలు, ప్రజలు సతమతమయ్యే పరిస్థితులున్నా కశ్మీర్‌ ఏదో తమ సొంత భూభాగమైనట్లుగా కలవరిస్తుంటారు. పరాయి పాలనలో అన్ని రంగాల్లోను అట్టడుగు చేరిన భారత్‌ను చూసి నేర్చుకోవలసిన అంశాలెన్ని ఉన్నా వాటినన్నింటినీ పక్కకు పెట్టి భారత్‌ను కశ్మీర్‌ విషయంలో కవ్వింపు చర్యలకు దిగడం నిత్యకృత్యంగా పాలకులెవరైనా పెట్టుకుంటున్నారు. దేశంలో ఎన్నో సమస్యలు ఎదురైనప్పుడల్లా వాటి పరిష్కారం కోసం కృషి చేయడం మాని దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకు కశ్మీర్‌ పల్లవిని అందుకుంటారు. ఎవరి నైనా ఏ విషయంలోనైనా ద్వేషభావం రెచ్చగొట్టాలంటే రెండే అంశాలుంటాయి. ఒకటి ప్రాంతం, రెండో మతం! అసలు పాకిస్థాన్‌ ఆవిర్భావమే మత ప్రాతిపకమీద కాబట్టి రెండో అంశంపై పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పాక్‌కు దొరికిన అంశం ప్రాంతం. ఇదే ఆయుధంతో ఇప్పటికి 75 ఏళ్ల నుంచి పాకిస్థాన్‌ భారత్‌తో యుద్ధం చేస్తూనే ఉంది. అయినా తెలుసుకోలేకో లేక ఇంతకుమించి తమ పబ్బం గడుపుకునేందుకు వేరే మార్గం లేదనుకోంటారో, అదీగాక ఇంక గత్యంతరం లేదనుకున్నారో గానీ కశ్మీర్‌ అంశాన్నే బ్రహ్మాస్త్రమన్నట్లుంది వాళ్లకు! అయితే ఒకపక్క దాయాది దేశం నుంచి నిత్యం ఘర్షణనెదుర్కొంటూనే భారత్‌ అభివృ్ధని గమనించి కూడా పాక్‌ పాలకులు చైతన్య వంతులు కావడం లేదు. సమస్య వస్తే కశ్మీర్‌ అంశాన్నే మంత్రంగా పఠిస్తున్నారుగానీ వాస్త వాన్ని గుర్తించడం లేదు. రోగమొకటైతే మందొకటిస్తే ఆరోగ్యం వికటిస్తుంగానీ ఫలితం శూన్యం. పక్కనున్న వారి అభివృద్ధిని చూసి నేర్చుకోవలసిం పోయి ద్వేషంతో నడుచుకుంటే ప్రయోజనం ఉండదు.
పాలకుల పాపం ప్రజలకు శాపంగా పరిణమించడం ఎవరికీ మంచిది కాదు. ఇప్పటికే పాకిస్థాన్‌ వాలా దిశలో ఉంది. దేశంలో ప్రతి వస్తువు ధరా ఆకాశాన్ని అందుకుంటోంది. ఐఎంఎఫ్‌ రుణాన్ని అన్‌లాక్‌ చేయించుకునేందుకు ఐఎంఎఫ్‌ వించిన షరతులకు తలొగ్గి నడు చుకోవడం మినహా గత్యంతరం లేని స్థితిలో 170 బియన్‌ డాలర్ల మేరకు పెట్రోలియం, గ్యాస్‌ లపై పన్ను విస్తూ మినీబడ్జెట్‌ను పార్లమెంట్‌ ఎదుటకు తీసుకొచ్చింది. ఇలా ప్రతి అంశం లోనూ పన్నులు పెంచుతూపోతే అనుకున్న ఫతం రాకపోగా ప్రజలకు సుంకాల శోకమే మిగులుతుంది. ఏదేశానికైనా శ్రీలంక, పాకిస్థాన్‌లను గుణపాఠంగా తీసుకుని అప్రమత్తంగా మసలుకోవలసి ఉంది. ఆ ముందుచూపు లేకపోవడం, రాజకీయ స్వార్థం ప్రజలకు భరించ రాని వేదనగా మారకూడదు. ఇది దేశాలకే కాదు, వ్యక్తిగత జీవితాలకూ వర్తిస్తుంది.
కీలకమైన రుణాన్ని అన్‌లాక్‌ చేసినందుకు అంతర్జాతీయ ద్రవ్యని (ఐఎంఎఫ్‌)ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఫెడరల్‌ ప్రభుత్వం బుధవారం అర్థరాత్రి పెట్రోల్‌, గ్యాస్‌ ధరలను చారిత్రాత్మక గరిష్ట స్థాయికి పెంచింది. పెట్రోలియం విభాగం నుంచి సలహాను తీసుకున్న తర్వాత ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రెగ్యులేటరీ అథారిటీ (ఓజీఆర్‌ఏ), నార్తర్న్‌ గ్యాస్‌ పైప్‌లైన్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌జీపీఎల్‌), సదరన్‌ గ్యాస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌యూఎల్‌) గ్యాస్‌ వినియోగ దారుల వర్గాల కోసం గ్యాస్‌ అమ్మకపు ధరలను 16 నుంచి 113 పీసీలకు పెంచింది. ఓజీఆర్‌ ఏ ప్రకారం, ఇంధన మంత్రిత్వ శాఖ (పెట్రోలియం విభాగం) బుధవారం గ్యాస్‌ అమ్మకపు ధరకు సంబంధించి ఫెడరల్‌ క్యానెట్‌ ఆమోంచిన ఆర్థిక సమన్వయ కమిటీ నిర్ణయాన్ని 2023 జనవరి ఒకటి నుంచి అమలులోకి తెచ్చింది. ఓజీఆర్‌ఏ సలహా తర్వాత సహజ వాయువు రిటైల్‌ వినియోగదారులకు వ్యతిరేకంగా విక్రయ ధరలను తెలియజేశారు. పేర్కొన్న నోటిఫి కేషన్‌ ఓజీఆర్‌ఏ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. 100 క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ను ఉపయోగించే దేశీయ కేటగిరీ గ్యాస్‌ వినియోగదారులు గ్యాస్‌ ధరలో 16.6% పెరుగుదల ఎదుర్కొంటారు. ఎందుకంటే అలాంటి గ్యాస్‌ వినియోగదారుల కోసం గ్యాస్‌ కొత్త ధర మిలియన్‌ ట్రిష్‌ థర్మల్‌ యూనిట్‌కు రూ. 350గా నిర్ణయించారు. అదేవిధంగా 200 క్యూక్‌ మీటర్ల గ్యాస్‌ను ఉపయోగించే గృహ వినియోగదారుల గ్యాస్‌ ధర 32% పెరిగింక్‌ మీటర్ల గ్యాస్‌ను ఉపయోగించే దేశీయ కేటగిరీ గ్యాస్‌ వినియోగదారులు గ్యాస్‌ ధరలో 16.6% పెరుగుదల ఎదుర్కొంటారు. ఎందుకంటే అలాంటి గ్యాస్‌ వినియోగదారుల కోసం గ్యాస్‌ కొత్త ధర మిలియన్‌ బ్రిటిష్‌ థర్మల్‌ యూనిట్‌కు రూ. 350గా నిర్ణయించారు. అదేవిధంగా 200 క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ను ఉపయోగించే గృహ వినియోగదారుల గ్యాస్‌ ధర 32% పెరి గింది. గృహ వినియోగదారులకు గ్యాస్‌ ధర రూ. 730 ఎంఎంబీటీయుగా నిర్ణయించారు.
అదేవిధంగా 300 క్యూక్‌ మీటర్ల గ్యాస్‌ను వినియోగించే గృహ వినియోగదారులకు గ్యాస్‌ ధర 69 శాతం పెరిగింది. వీరికి గ్యాస్‌ ధర రూ. 1250/ ఉంటుంది. గతంలో వారు రూ. 738 చెల్లిస్తున్నారు. గ్యాస్‌ మీటర్లు. 400 క్యూక్‌ మీటర్ల గ్యాస్‌ను ఉపయోగించే గ్యాస్‌ వినియోగదారులకు, గ్యాస్‌ ధర 99 శాతంగా ఉంది. 400 క్యూబిక్‌ మీటర్ల కంటే ఎక్కువ గ్యాస్‌ వాడే గ్యాస్‌ వినియోగదారులు, గ్యాస్‌ ధర 124 శాతం పెరిగింది. వాణిజ్య గ్యాస్‌ వినియోగదారుల గ్యాస్‌ ధర 28.6 శాతం పెరిగింది. ఈ కొత్త భారీ గ్యాస్‌ ధరల పెంపు 2023 జనవరి 1 నుంచి జూన్‌ 30 వరకు వర్తిస్తాయని పేర్కొన్నారు. భారీ గ్యాస్‌ ధర పెంపు కారణంగా ఆరు నెలల్లో రూ. 310 బిలియన్‌ డాలర్లు వస్తాయని అంచనా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News