Monday, November 25, 2024
Homeనేరాలు-ఘోరాలుFevikwik Murder : జంటను తనముందు శృంగారం చేయాలన్న మంత్రగాడు.. ఆ తర్వాత దారుణం

Fevikwik Murder : జంటను తనముందు శృంగారం చేయాలన్న మంత్రగాడు.. ఆ తర్వాత దారుణం

పేరు మోసిన తంత్రగాడు.. తన వద్దకు వచ్చే ఓ జంటను కోరరాని కోరిక కోరి.. ఆఖరికి వారి ప్రాణాలు తీశాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో నవంబర్ 15న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన జరిగిన మూడ్రోజుల తర్వాత ఆ మంత్రగాడిని పోలీసులు అరెస్ట్ చేసి.. రిమాండ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉదయ్ పూర్ లోని కెలాభవాడి ఏరియాలో రాహుల్ మీనా (30) తన కుటుంబంతో ఉండేవాడు. వృత్తిరీత్యా అతడు ఉపాధ్యాయుడు. అతని కుటుంబ సభ్యులు స్థానిక మంత్రగాడిగా పేరొందిన భలేష్ కుమార్ వద్దకు వెళ్లి పూజలు చేయించుకునేవారు.

- Advertisement -

అలాగే.. సోనూ కున్వార్ (28) అనే అమ్మాయి కుటుంబీకులు కూడా ఆ మంత్రగాడి వద్దకే వచ్చేవారు. ఈ క్రమంలో రాహుల్-సోనూల మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పటికే వాళ్లిద్దరికీ వేర్వేరు వ్యక్తులతో పెళ్ళిళ్లు అయ్యాయి. సోనూ కి ఆ మంత్రగాడితో శారీరక సంబంధం కూడా ఉంది. ఒకానొక సమయంలో రాహుల్-సోనూల మధ్య సంబంధం గురించి సోనూనే ఆ మంత్రగాడికి చెప్పింది. దాంతో భలేష్ కుమార్ రాహుల్ భార్యకు అసలు విషయాన్ని చెప్పగా.. దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. దాంతో భలేష్ కు రాహుల్ వార్నింగ్ ఇచ్చాడు. తమ జోలికొస్తే.. వేధింపుల కేసు పెడతానని బెదిరించాడు.

రాహుల్ వార్నింగ్ తో.. తనకు-సోనూకి మధ్యనున్న సంబంధం బయటపడితే పరువు పోతుందని భావించిన భలేష్ కుమార్.. ఎలాగైనా వారిద్దరినీ హతమార్చాలని భావించాడు. నవంబర్ ఇద్దరినీ నిర్మానుష్య ప్రదేశానికి రమ్మన్నాడు. తనముందు ఇద్దరూ శృంగారం చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయన్నాడు. అతడి మాటల్ని గుడ్డిగా నమ్మిన ఆ జంట.. శృంగారంలో మునిగింది. అదే అదనుగా భావించిన భలేష్ అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న 50 ట్యూబ్ ల ఫెవిక్విక్ ను వారిద్దరి జననాంగాలపై పోశాడు. సోనూ నుండి రాహుల్ విడిపోయే క్రమంలో ప్రైవేటు భాగాలు అతుక్కుపోయి తీవ్రగాయాలయ్యాయి. దాంతో ఇద్దరూ తీవ్ర రక్తస్రావంతో అక్కడే మరణించాడు.

అనంతరం భలేష్ కుమార్ పరారయ్యాడు. మూడ్రోజుల తర్వాత మృతదేహాలను కనుగొన్న పోలీసులు..కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి పోస్టుమార్టమ్ కు తరలించారు. పరారీలో ఉన్న భలేష్ కుమార్ ను వెతికి అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News