గత రెండు రోజులుగా పలనాడు జిల్లాలో కురుస్తున్న విస్తృత వర్షాలు దృష్ట్యా అమరావతి మండలంలో వైకుంటపురం, అమరావతి, గిడుగు, పొందుగల, మునుగోడు, ధరణికోట లంక గ్రామాలలో తమ గొర్రెలను మేపుటకు గత 20 రోజుల క్రితం వెళ్ళి వరదలో చిక్కుకున్న 36 మందిని మరియు వారి 1500 గొర్రెలను, అదేవిధంగా అచ్చంపేట మండల పరిధిలోని కొనూరు, కస్టాల, చామర్రు లంక గ్రామాలలో చిక్కుకొన్న 14 మందిని, వారి 2001 గొర్రెలను వెరసి మొత్తం 50 మందిని మరియు 3501 గొర్రెలను యుద్ద ప్రాతిపదికన శ్రీయుత జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు చొరవతో మొత్తం 14 బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతానికి సంబంధిత రెవెన్యూ సిబ్బంది తరలించారు. ఆకస్మికంగా సంభవించిన వరద బారి నుండి తమను రక్షించి, తమ గొర్రెల ప్రాణాలు కాపాడినందుకు బాధిత ప్రజలు ప్రభుత్వానికి తమ ధన్యవాదములు తెలియ చేశారు. పై లంక గ్రామాలను జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, జిల్లా ఎస్పీ శ్రీనివాస్ తో కలిసి సందర్శించారు.