Saturday, November 23, 2024
HomeNewsPonnam says all people must be alert: ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

Ponnam says all people must be alert: ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ఎక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆదివారం రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పత్తి మున్సిపల్ కమీషనర్, ఇతర ఉన్నత అధికారులు, మానకొండూరు ఎమ్మేల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో పాటు పలువురు ముఖ్య నేతలతో కలిసి లోయర్ మానేరు డ్యాం రిజర్వాయర్ ను సందర్శించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిలో తప్ప ప్రజలు బయటికి రాకపోవడం మంచిదని అన్నారు.
భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నామని,
ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి, అధికారుల సూచనల మేరకు ప్రజలు సహకరించాలని అన్నారు. ఆశించిన మేరకంటే అధిక వర్షాలతో రైతన్నల్లో ఆనందం వెల్లువిస్తుందన్నారు.
రిజర్వాయర్ల సామర్థ్యాన్ని బట్టి దిగువకు నీటిని విడుదల చేయనున్నట్లు చెప్పారు.
గత కొంత కాలంగా చెరువులు, కుంటలు నిండలేదని ఆందోళన పడుతున్న నేపథ్యంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు , చెరువులు, కుంటలు నిండుతున్నాయని,
మరో రెండు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.


జిల్లాలో పునరావాస కేంద్రాలకు తరలించెంత ఇళ్లలో నుండి ప్రజలను ఖాళీ చేసే పరిస్థితి ఎక్కడ లేదని అన్నారు. కోహడ్ – ముల్కనూరు, ఇల్లంతకుంట మండలంలో తదితర ప్రాంతాల్లో రోడ్ల మీద నుండి వరద పోవడం వల్ల రవాణా అగిపోయిందని తెలిపారు. మిడ్ మానేరు కు మోయ తుమ్మెద వాగు , మూల వాగు నుండి వరద వస్తుందని, ఎల్లంపల్లి నుండి రోజువారీగా ఇప్పటికే నీటి విడుదల జరుగుతుందని అన్నారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు, రంగ నాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ వరకు ప్రాజెక్ట్ లో నింపుకునే విధంగా వర్షాలు పడ్డాయని, అటు కిందికి కోదాడ వరకు నీళ్ళు అందించేందుకు అవకాశం ఉందన్నారు.

కరీంనగర్ తో పాటు ఇతర మున్సిపాలిటీలలో ఎక్కడ లోతట్టు ప్రాంతాల్లో నీళ్ళు ఇళ్లల్లోకి వచ్చిన పరిస్థితి ఎక్కడ లేదని అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని అన్నారు. అందరూ అధికారులు క్షేత్ర స్థాయిలో వారు కేంద్రాల్లో నిరంతరం పని చేస్తున్నారని, హైదరాబాద్ ఇంచార్జి మంత్రిగా అక్కడ అధికారులతో మాట్లాడనని ఎక్కడ ఇబ్బంధి లేదన్నారు.
హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టు లలో లెవెల్స్ నిండే పరిస్థితి ఉందని అన్నారు. కాళేశ్వరం లో టెక్నికల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే నీటి నిల్వ కొనసాగుతుందని,
ఎల్లంపల్లి నుండి ప్రతి చుక్క ఉపయోగించుకునే విధంగా ప్రాజెక్ట్ లలో పంపిస్తున్నట్లు చెప్పారు.
శ్రీరామ్ సాగర్ లో ప్రస్తుతం 64 టిఎంసి ల ఉన్నాయని, పూర్తి స్థాయి నిండగానే వరద కాలువ ద్వారా నీళ్ళు విడుదల జరుగుతుందని అన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు లో తమ్మడి హట్టి నుండి గుండెకాయ లాంటి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు నీళ్లు తీసుకొచ్చేది, ఆ నీరు మిడ్ మానేరు ,రంగ నాయక సాగర్,మల్లన్న సాగర్,కొండ పోచమ్మ సాగర్ లకు తీసుకుపోయేదని అన్నారు. వర్షాలు, ప్రాజెక్టు లు ,వ్యవసాయం పేరు మీద రాజకీయాలు చేయద్దని హితువు పలికారు.
హైదరాబాద్ లో 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని అన్నారు. రోడ్ల పై వరద వెళ్తుంటే ద్విచక్ర వాహనాలకు కూడా అనుమతి ఇవ్వకూడదని అధికారులకు సూచించారు.
సిద్దిపేట – హనుమకొండ దారిలో కూడా వరద పోతుందని, ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టిన ప్రజలు సహకరించాలని అన్నారు. లోయర్ డ్యాం ను సందర్శించిన వారిలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాటు కరీంనగర్ నియోజకవర్గ బాధ్యులు పురుమల్ల శ్రీనివాస్, వైద్యుల అంజన్ కుమార్, పులి ఆంజనేయులు గౌడ్, మల్యాల సుజిత్ కుమార్, పురం రాజేశం, ఎస్.కె సిరాజ్ హుస్సేన్, మాచర్ల ప్రసాద్, ఆకారపు భాస్కర్ రెడ్డి, మల్లికార్జున రాజేందర్, చాడగొండ బుచ్చిరెడ్డి, ముల్కల ప్రవీణ్, బత్తిని శ్రీనివాస్ గౌడ్, సుధా గోని లక్ష్మీనారాయణ గౌడ్, కూస రవీందర్, కంకణాల అనిల్ కుమార్ గుప్తా, కర్ర రాజశేఖర్, బొబ్బిలి విక్టర్, మెండి చంద్రశేఖర్, ఆకుల నరసయ్య, రాచకొండ చక్రధర్ రావు, కుర్రపోచయ్య, గడ్డం శ్రీరామ్, నాగుల సతీష్, గంగుల దిలీప్, గడప అజయ్, వంగల విద్యాసాగర్, సమద్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News