Tuesday, July 2, 2024
Homeఆంధ్రప్రదేశ్Heat wave: ఇంకా నాలుగు రోజులు వడగాల్పులు

Heat wave: ఇంకా నాలుగు రోజులు వడగాల్పులు

ఈరోజు 188 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 195 మండలాల్లో వడగాల్పులు

రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ఈరోజు 188 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 195 మండలాల్లో వడగాల్పులు, రేపు 23 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 248 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

- Advertisement -

మంగళవారం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 45°C, ప్రకాశం జిల్లా జువ్విగుంటలో 44.9°C, కాకినాడ జిల్లా సీతంపేటలో 44.7°C, పల్నాడు జిల్లా రవిపాడులో 44.3°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 112 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 220 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News