కృష్ణ లంక ప్రాంతంలో మరబోటులో ప్రయాణించి భాధితులకు ఆహారం అందించిన రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధ సారధి.
వరద భాదితులకు రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్ని విధాలుగా ఆడుకుంటుందని రాష్ట్ర గృహనిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి తెలియ చేశారు. విజయవాడ నగర పాలక సంస్థ ఫరిధిలోని కృష్ణ లంక ప్రాంతంలోని 15,16 డివిజన్ ల్లోని రామలింగేశ్వరనగర్, గీతా నగర్ కట్ట తదితర ప్రాంతాలలో పర్యటించి భాదితులతో మాట్లాడి అందుతున్న సహాయక చర్యలు గురించి తెలుసుకున్నారు.
చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా వరదలు సంభవించాయని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో పెద్ద నష్టాన్ని నివారించ గలిగామని మంత్రి తెలియచేశారు.నగరంలోని వరద భాదితులను ఆదుకుని అవసరమైన సహాయక చర్యలను చేపట్టడానికి ప్రభుత్వం 10 హెలికాప్టర్లు, వందలాది మరబోట్లును ఉపయోగిస్తోందని మంత్రి పార్ధ సారధి తెలియచేశారు.
భాదితులకు హెలికాపటర్లు ద్వారా ఆహారం, మంచి నీరు అందిస్తున్నామని, వరద నీటిలో చిక్కుకున్నవారికి బోట్లు ద్వారా అందిస్తున్నామని మంత్రి తెలియచేశారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, వరద తగ్గిన తరువాత నష్టం అంచనా వేసి ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయాన్ని అంద చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరికి సహాయం అందచేస్తామని, సహాయ శిబిరాలు సందర్శించి బాధితులకు ఆండగా ఉండాలని మంత్రులు,శాసన సభ్యులు, అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి తెలియచేశారు.
15వ డివిజన్లో రామలింగేశ్వరనగర్ లో స్థానిక శాసన సభ్యుడు గద్దే రామోహన్ రావుతో కలిసి బాధితులకు ఆహారం, మంచి నీరు అందచేశారు. మంత్రి వెంట ఏలూరు శాసన సభ్యుడు బి.రాధాకృష్ణ, గోపాలపురం శాసన సభ్యులు వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు.
మరబోటులో బాధితుల వద్దకు 15వ డివిజన్ రామలింగేశ్వరనగర్ సమీపంలోని కోటినగర్ వరదనీటిలో చిక్కుకున్న బాధితుల వద్దకు మంత్రి పార్ధ సారధి మరబోటులో వెళ్లి ఆహారం,మంచి నీరు స్వయంగా అందించారు.ఈ కాలనీలో గత మూడు రోజులు నుంచి వరద నీరు ఉండి పోవడంతో బైటకు రాలేక పోతున్నామని బాధితులు మంత్రికి వివరించారు.
మంత్రి పార్థసారథి స్వయంగా తన వ్యక్తిగత నిధులు 20వేల రూ.లు వెచ్చించి మరబోటులో స్వయంగా వచ్చి ఆహారం, మంచి నీరు అందించటం పట్ల బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు.మంత్రి వెంట ప్రత్యేక అధికారి కర్నూల్ జిల్లా ఎస్.పీ బిందుమాధవ్, రొండి. కృష్ణయాదవ్, బొప్పన, భవకుమార్ తదితర నేతలు పాల్గొన్నారు.