Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Kodali Nani : వారిద్దరిలో ఎవరు పోటీ చేసినా గెలిచేది నేనే

Kodali Nani : వారిద్దరిలో ఎవరు పోటీ చేసినా గెలిచేది నేనే

ఏపీ మాజీ మంత్రి, గుడివాడ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని 2024 ఎన్నికలపై జోస్యం చెప్పారు. గుడివాడ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున చంద్రబాబు, నారా లోకేశ్ లలో ఎవరు వచ్చి పోటీ చేసినా మళ్లీ వైసీపీ అభ్యర్థిగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నివేల కోట్లు ఖర్చు పెట్టినా.. ఎన్ని కుల సంఘాలు వచ్చినా తన గెలుపును ఏవీ, ఎవరూ ఆపలేరన్నారు.

- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను తిట్టేందుకే చంద్రబాబు పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. తనకు ఇవే చివరి ఎన్నికలని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎం కాకపోతే రాష్ట్ర ప్రజలకు జరిగే నష్టమేమీ లేదన్నారు. నిజంగానే టీడీపీకి, చంద్రబాబుకి 2024 ఎన్నికలే చివరి ఎన్నికలు అవుతాయని, టీడీపీ నుంచి చంద్రబాబు, లోకేశ్ ను తరిమేందుకు ఎన్టీఆర్ వారసులు సిద్ధంగా ఉన్నారని వ్యంగ్యంగా మాట్లాడారు. ఎన్నికల తర్వాత ఇదేం ఖర్మరా బాబూ అని చంద్రబాబు, లోకేశ్ అనుకుంటారని.. ఆ తర్వాతి ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదని జోస్యం చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad