Monday, May 20, 2024
Homeహెల్త్Winter Skin Care : చర్మం పగిలిపోతోందా.. ఈ జాగ్రత్తలు పాటించండి

Winter Skin Care : చర్మం పగిలిపోతోందా.. ఈ జాగ్రత్తలు పాటించండి

చలికాలం వచ్చేసింది. రోజురోజుకూ రాత్రి ఉష్ణోగ్రతలతో పాటు.. పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతుండగా.. నగర ప్రాంతాల్లో 15-20 డిగ్రీల లోపే ఉంటున్నాయి. ఫలితంగా ప్రజలు రాత్రి, పగలు తేడా లేకుండా వణికిపోతున్నారు. శీతాకాలంలో చాలామంది చర్మం పగిలిపోవడం, చర్మంపై తెల్లటి గీతలు ఏర్పడటం వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారు ఈ జాగ్రత్తలను పాటించడం వల్ల చర్మం పగుళ్ల నుండి సురక్షితంగా ఉంటుంది.

- Advertisement -

చాలామందికి ఎక్కువసేపు స్నానం చేసే అలవాటు ఉంటుంది. కానీ.. శీతాకాలంలో 5 నిమిషాల పాటు స్నానం చేయడం కూడా మంచిది కాదు. వీలైనంత త్వరగా స్నానం ముగించుకోవాలి. అలాగే చర్మం పొడిబారే సమస్య ఉన్నవారు సాధారణ సబ్బును వాడకూడదు. గ్లిజరిన్ కలిగిన సబ్బులను వాడటం చర్మానికి మంచిది.

స్నానం చేసిన వెంటనే చర్మంపై తడి మొత్తాన్ని టవల్ తో తుడిచేయాలి. వెంటనే మాయిశ్చరైజర్ రాయాలి. ఇలా చేయడం వల్ల చర్మం పగలకుండా ఉంటుంది.

చలికాలంలో దురద సమస్యలు కూడా బాధిస్తుంటాయి. అశ్రద్ధ చేస్తే.. అది క్రమంగా జిరోసిస్, ఎగ్జిమా, డెర్మటైటిస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గా మారే ప్రమాదం ఉంది. యాంటి ఫంగల్ సబ్బును వాడాలని నిపుణుల సూచన.

చర్మం పొడిబారకుండా ఉండేందుకు.. మాయిశ్చరైజర్లను వాడుతుంటారు. ట్యూబులలో లభించే మాయిశ్చరైజర్లు కాకుండా.. చిన్న సీసాలలో లభించే వాటిని వాడితే.. మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి. అలాగే.. మాయిశ్చర్లలో సెరామిడ్స్, గ్లిజరిన్, హ్యాలురోనిక్, ఆమ్లం, సిలికాన్, మినరల్ ఆయిల్, సోర్బిటాల్ ఉండేలా చూసుకోవాలి. ఇవి తేమని లాక్ చేసి, చర్మం పొడిబారకుండా కాపాడుతాయి.

బయటికి వెళ్లేటపుడు పెట్రోలియం జెల్లీని వెంట తీసుకెళ్లడం మంచిది. చర్మం పొడి బారిన వెంటనే పెట్రోలియం జెల్లీని రాయడం వల్ల తరచూ సమస్య రాకుండా ఉంటుంది.

అలాగే స్నానం చేసే ముందు పచ్చిపాలలో కాటన్ ను ముంచి.. చర్మానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్నానం చేయడం వల్ల మెరుగైన ఫలితం ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News