Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్5G Communication Tech course: ఏపీలో 5G కమ్యూనికేషన్ టెక్నాలజీ కోర్సు

5G Communication Tech course: ఏపీలో 5G కమ్యూనికేషన్ టెక్నాలజీ కోర్సు

విద్యార్థుల ఉపాధిని పెంచడానికి..

APSSDC ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం “5G కమ్యూనికేషన్ టెక్నాలజీ” కోర్సును ప్రారంభించింది.

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం “5G కమ్యూనికేషన్ టెక్నాలజీ” పై ఒక మార్గదర్శక కోర్సును APSSDC తాడేపల్లి కార్యాలయం లో ప్రభుత్వ సలహాదారు (SD&T) చల్లా మధుసూధన్ రెడ్డి, APSSDC చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ & CEO, డా. వినోద్ కుమార్ V, IAS కలిసి ప్రారంభించారు.

టెలికాం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ (TSSC) మరియు జర్మన్ అకాడమీ ఆఫ్ డిజిటల్ ఎడ్యుకేషన్ (DADB) సహకారంతో, APSSDC ట్రైనింగ్‌తో కూడిన హై-క్లాస్ ఆన్‌లైన్ కోర్సులను అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ యువతకు ప్రపంచ స్థాయి విద్యను అందించడానికి కొత్త మార్గాలను కల్పించి , వేగంగా అభివృద్ధి చెందుతున్న 5G సాంకేతికత రంగంలో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును పెంపొందిస్తుంది.

APSSDC MD& CEO డా. వినోద్ కుమార్ V, IAS మాట్లాడుతూ ‘5G కమ్యూనికేషన్ టెక్నాలజీ’ కోర్సు ప్రారంభించటం వల్ల, అత్యాధునిక విద్యను అందించడానికి, ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థుల ఉపాధిని పెంపొందించడానికి APSSDC యొక్క అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది అని తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు (SD&T) చల్లా మధుసూధన్ రెడ్డి, APSSDC చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ & CEO, డా. వినోద్ కుమార్ V, IAS ,ED & ADG- NAC కే దినేష్ కుమార్, జర్మన్ అకాడమీ ఆఫ్ డిజిటల్ ఎడ్యుకేషన్ (DADB) తరుపున శరణ్య రీజినల్ హెడ్ ప్రాజెక్ట్ మేనేజర్, APSSDC సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News