Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Adoni: పెద్దాయనకు నామినేటెడ్ పోస్ట్, ఆ ఎమ్మెల్యేకు ఇక గడ్డు కాలమే!

Adoni: పెద్దాయనకు నామినేటెడ్ పోస్ట్, ఆ ఎమ్మెల్యేకు ఇక గడ్డు కాలమే!

దసరా లోపు పేరు ప్రకటించే..

అలనాటి కర్నూల్ జిల్లా రాజకీయంలో పార్టీ ఏదైనా సరే పెద్దాయన అంతే అందరికీ గుర్తు వచ్చేది మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి. ఆ తర్వాత కె ఈ కృష్ణ మూర్తి పేరు చెప్పేవారు. వీరిద్దరు ప్రస్తుతం రాజకీయంలో లేనందున ప్రస్తుతం పెద్దాయనగా పిలవబడే ఏకైక రాజకీయ కురవృద్దుడు కొంకా మీనాక్షి నాయుడు.

- Advertisement -

4 దశాబ్దాల రాజకీయం..

నాలుగు దశాబ్దాలుగా రాజకీయం చేస్తూ అలుపెరగని నాయకుడు.తన రాజకీయ ప్రస్థానంలో 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఆదోని నియోజకవర్గంలో టీడీపీ అంటే మీనాక్షి నాయుడు, మీనాక్షి నాయుడు అంటే టీడీపీ అనేలా గుర్తింపు. రాజకీయ పావులు కదలపడంలో దిట్ట కావడంతో తాను నమ్ముకున్న వ్యక్తులకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టి తన ఉనికిని చాటుకున్నాడు.

నారా కుటుంబం మెచ్చిన లీడర్..
2014 లో రాష్ట్రంలో వైసిపి హవా నడించింది. 2024 ఎన్నికల ఏడాది ముందు నుండే టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైసిపిపై దాడి చేసేందుకు కుటుంబాన్ని రంగంలో దింపాడు. యువగళం పాదయాత్ర ఆదోని నియోజకవర్గంలో పర్యటించినప్పుడు గ్రూప్ తగాదాలు ఉన్నప్పటికీ తన మార్క్ ను చూపించి నారా కుటుంబంతో శభాష్ అనిపించుకున్నాడు. గత ఏడాది నవంబర్ లో ‘ఇదేం ఖర్మ’ బాబు రూట్ మ్యాప్ ఆదోని నియోజకవర్గంలో లేనప్పటికీ అప్పటి మాజీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదోని లో బసచేసి వెళుతుండగా, మీనాక్షినాయుడు కార్యకర్తలను భారీగా సమీకరించి రోడ్ షో చేయించి చంద్రబాబు దృష్టిలో పడడమే కాక ప్రత్యర్థి పార్టీ నాయకులకు దడ పుట్టించాడు. చంద్రబాబు నాయుడు అరెస్టును తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తల గుండెలు పగిలి మరణించడంతో, కుటుంబానికి భరోసా ఉండాలని నారా భువనేశ్వరి పర్యటించి చెక్ లు అందించింది. అపుడు భువనేశ్వరమ్మ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉండగా రాత్రి బస ఆదోనిలోనే ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లను కూడా దగ్గరుండి మీనాక్షి నాయుడే చూశారు. అదోనిలో అయితే మీనాక్షి నాయుడన్న అన్ని ఏర్పాట్లు చేస్తాడు అని నారా లోకేష్ సూచించడంతోనే నారా భువనేశ్వరి బస చేసినట్లు అప్పట్లో మాట్లాడుకోవడం జరిగింది. చంద్రబాబు దగ్గర ఇంత పేరు సంపాదించడంతో 2024 ఎన్నికల్లో టికెట్ ఖచ్ఛితంగా పెద్దాయనకే అని ప్రచారం జరిగిన కూటమిలో బాగంగా బిజెపి ఎగురేసుకొని పోయింది.
కూటమిలో బాగంగా ఎన్నడూ డిపాజిట్ దక్కని బిజెపి గెలుపుకు తన భుజస్కందాలపై వేసుకొని, తన కార్యకర్తల్లో మనో ధైర్యం నింపుతూ గెలుపుకు కృషి చేశాడు. బిజెపి ఎమ్మెల్యే గెలిచాక టీడీపీని, మీనాక్షి నాయుడును అంటీముట్టనట్లు దూరం పెట్టిన విషయం అందరికీ తెలిసిందే దీంతో జీర్ణించుకోలేని టీడీపీ కార్యకర్తలు మా పెద్దాయనకు రాష్ట్ర కేబినెట్ హోదా కలిగిన నామినేటెడ్ పోస్ట్ వస్తుందని కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు.

విజయవాడ టూర్ కూడా అందుకే..

ఇటీవలే మీనాక్షి నాయుడు విజయవాడకు వెళ్లువచ్చినట్లు, నామినేటెడ్ పోస్ట్ ఖరారు అయినట్లు సమాచారం. దసరా పండుగలోపు రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉన్నది.
మీనాక్షి నాయుడు కు కేబినెట్ హోదా దక్కితే ప్రస్తుత ఎమ్మెల్యేకు గడ్డుకాలం తప్పదు ఎమ్మెల్యేగా గౌరవం ఉన్నప్పటికీ బలమైన టీడీపీ కేడర్ బిజెపి గుమ్మం తొక్కడానికి నిరాకరించవచ్చు. ఇప్పటికే పట్టణంలో మీనాక్షి నాయుడును ఎమ్మెల్యే దూరం పెట్టి పెద్ద తప్పు చేస్తున్నాడని చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా పెద్దాయనకు సముచిత గౌరవం దక్కేనా.. వేచి చూద్దాం..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News