ఆదోని పట్టణం శివారులో 167వ జాతీయ రహదారికి అనుసంధానంగా ఆదోని -ఎమ్మిగనూరు రహదారి నుండి ఆదోని-పత్తికొండ రహదారి మీదుగా ఆదోని -ఆలూరు రహదారి వరకు కొత్తగా నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు ను 150 అడుగుల్లో నాలుగు లైన్లుగా బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్టు ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు. సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధ్యక్షతన ఆర్ అండ్ బి శాఖ, ఎన్ హెచ్ శాఖ అధికారులతో బైపాస్ రోడ్డు నిర్మాణం పై ఎమ్మెల్యే అధికారులతో చర్చించారు. ఇప్పటికే చేపట్టిన రోడ్డు నిర్మాణంకు చేసిన భూసేకరణను నాలుగు లైన్లుగా మార్పు చేసి రోడ్డును 100 అడుగుల నుండి 150 అడుగులకు విస్తరించేందుకు రెవెన్యూ ,ఆర్ అండ్ బి శాఖ అధికారులు చర్యలు చేపట్టారన్నారు. ముఖ్యంగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నాలుగు లైన్లు రోడ్డుగా బైపాస్ రోడ్డు నిర్మించాలని జాతీయ రహదారుల మండలి సూచించింది. బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం త్వరలోనే టెండర్లు పిలుస్తారని, రోడ్డు నిర్మాణం పనులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు.
Adoni: నాలుగు లైన్లుగా ఆదోని బైపాస్ రోడ్డు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES