మైనార్టీ మహిళ ఫాతిమా భగవద్గీతను అభ్యసించి మతాలు వేరైనా దేశమంత ఒక్కటే అని చాటి చెప్పింది. పెద్ద హరివరం గ్రామంలో ఈనెల 25న శ్రీ కాశీ విశ్వనాథ స్వామి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో 16వ రథోత్సవ ఆహ్వానం సందర్భంగా గ్రామ ప్రజలకు భగవద్గీతం విధి విధానాలపై ఫాతిమా ప్రసంగించనుంది. ఇబా ఫాతిమా భగవద్గీత అనువాదాన్ని 2018లో ప్రారంభించి, మూడు నెలల్లో 700 శ్లోకాలను అనువదించింది. భగవద్గీతను ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో అనువదించి తన మేధస్సును చాటుకుంది. ఈ సందర్భంగా ఇబా ఫాతిమా మాట్లాడుతూ చిన్న చిన్న సమస్యలకు పెద్దపెద్ద తగాదాలు చేసుకుని కుటుంబాలను చిన్నభిన్నం చేసుకోకూడదు అనుకుంటే భగవద్గీత, ఖురాన్ చదవాలన్నారు.
Adoni: భగవద్గీతను ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ లోకి అనువదించిన ఫాతిమా
సంబంధిత వార్తలు | RELATED ARTICLES