Saturday, September 28, 2024
Homeఆంధ్రప్రదేశ్Adoni: ఆదోని బరిలో బిజెపి?

Adoni: ఆదోని బరిలో బిజెపి?

గెలుపెవరిదో మరి?

ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం బరిలో వైసీపీ, బిజెపి పోటీ పడబోతున్నాయి. వైసీపీ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి బరిలో ఉండగా, పొత్తులో బాగంగా బిజెపి నుండి ప్రముఖ పారిశ్రామిక వేత్త విట్టా రమేష్ బరిలో ఉంటున్నట్లు సమాచారం. గురువారం టీడీపీ, జనసేన రెండవ జాబితాను ప్రకటించారు. జాబితాలో అటు టీడీపీ, ఇటు జనసేన పేరు లేకపోవడంతో ఆదోని ప్రజల్లో అయోమయం, పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. బీజేపీకి టికెట్ కేటాయిస్తున్నట్లు అంతర్గతంగా బీజేపీ నాయకులకు సమాచారంపై నుండి ఆదేశాలు రావడంతో బిజెపి శ్రేణులు వార్తను బయటికి గుప్పుమంది. ఆ నోటా ఈ నోటా వార్త బయటికి రావడంతో టీడీపీ, జనసేన పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు నిజమేనా అంటూ పరుగులు తీశారు. టీడీపీ, జనసేన ఇంఛార్జిలు కూడా బిజెపికి వచ్చినట్లు తెలిపారు. అయినప్పటికీ పూర్తి ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి అని జనసేన ఇంఛార్జి మల్లప్ప ఆశాభావం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా వారి మాటల బట్టి, బిజెపి నాయకుల సంతోషాన్ని బట్టి చూస్తే ఆదోని టికెట్ బిజేపికే వంద శాతం ఖరారు అయినట్లు తెలుస్తుంది.

- Advertisement -

పూర్తి ప్రకటనలో ఇదే నిజమైతే బిజెపి నుండి ప్రముఖ పారిశ్రామిక వేత్త విట్టా రమేష్, డాక్టర్ పార్థసారథి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. బిజెపి జిల్లా అధ్యక్షుడు కునిగిరి నీలకంఠ పోటీ చేయడానికి విముఖత చూపినట్లు సమాచారం. గురువారం రాత్రి నాటికి ఎవరు బరిలో ఉండేది తెలియవచ్చునని బిజెపి నాయకులు చెబుతున్నారు. గతంలో ఆర్య వైశ్య సామాజిక వర్గం నుండి కాంగ్రెస్ టికెట్ పై రాచోటి రామయ్య గెలుపొందారు. ఇదే సామాజిక వర్గం నుండి ఇపుడు విట్టా రమేష్ బిజెపి నుండి బరిలో ఉండవచ్చు. ఒకవేళ డాక్టర్ పార్థ సారథి రేస్ లో ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వాల్మీకి సామాజికవర్గం అయిన పార్థ సారథి ఇక్కడ నిలబడితే వారి సామాజిక వర్గం దాదాపు 50 వేల దాకా ఓట్లు ఉన్నాయి. అయితే పట్టణంలో విట్టా రమేష్ కు పేరు ప్రఖ్యాతలతో పాటు, మంచితనం, మృదు స్వభావి అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ఇక్కడ వైసీపీని ఢీ కొట్టాలంటే టీడీపీ, జనసేన అండ తప్పనిసరి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News