రాయలసీమ ప్రజలు ప్రతిసారి రాజకీయ నాయకుల చేత మోసపోతూనే ఉన్నారని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు,మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. గతంలో ఆదోని ప్రాంతం కోనసీమ మాదిరిగా సస్యశ్యామలంగా ఉండేదని, సౌత్ ఇండియాలోనే ఇండస్ట్రియల్ హబ్ గా ఆదోని అభివృద్ధిలో ఉరకలెడుతుంటే స్థానిక రాజకీయ నాయకుల స్వార్థ రాజకీయాలతో సర్వనాశనమైందని ఉద్వేగానికి గురయ్యారు. చరిత్రత్మకమైన ఆదోనినే రెండవ ముంబాయిగా పిలిచేవారన్నారు. పశ్చిమ రాయలసీమ ప్రాంతంలో తుంగభద్ర జలాలు జలచౌర్యం జరుగుతోందని..వలసలు, నిరుద్యోగ, ఆత్మహత్యలు, ఉపాధి లేక చెడు అలవాట్లకు, వ్యసనాలకు యువత బానిసై జీవితాల నాశనం అవుతున్నా రాజకీయ నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. పేరుకు మాత్రం ప్రాజెక్టులని.. కృష్ణదేవరాయల కాలంలో ఇంతకంటే పెద్దవి చెరువులుగా ఉండేవని.. వాటిని కనీసం కాపాడుకోలేని దౌర్భాగ్య స్థితిలో పాలకులున్నారని విమర్శించారు. శ్రీశైలం ప్రాజెక్టులో 100 టీఎంసీల మేర ఒండ్రుమట్టి పేరుకుపోయిందన్న సోయి ఏ లీడర్కైనా ఉందా అని బైరెడ్డి నిప్పులు చెరిగారు.
Adoni: పాలకులు సీమను సర్వనాశనం చేస్తున్నారు: బైరెడ్డి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES