ఆదోనిలోని బిణిగేరి గ్రామ సమీప కొండలలోని శ్రీ గిరి క్షేత్రంలో కొలిచే వారికి కొంగు బంగారంగా భక్తుల ఆరాధ్యదైవంగా వెలిసిన శ్రీ శ్రీ శ్రీ పంచలింగేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 18వ తేది నుండి 22 తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలను అంగరంగా వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు శ్రీనివాస నాయన, రమాదేవి దంపతులు తెలిపారు.
- Advertisement -
5రోజులు పాటు జరిగే ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామల ప్రజలే కాకుండా కర్నాటక, తెలంగాణ, తమిళనాడు నుంచి భక్తులు అదిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొకులు తీర్చుక్కుంటారు. ఈ ఉత్సవాలకు శ్రీగిరి క్షేత్రాన్ని రంగు రంగుల విద్యత్ దీపాలతో అలంకరించారు.