Saturday, July 27, 2024
Homeఆంధ్రప్రదేశ్AP High Court: బ‌దిలీ ప్ర‌తిపాద‌న వివ‌క్ష‌కు సంకేతం.. ఏపీ హైకోర్టు న్యాయ‌మూర్తుల బ‌దిలీని నిర‌సిస్తూ...

AP High Court: బ‌దిలీ ప్ర‌తిపాద‌న వివ‌క్ష‌కు సంకేతం.. ఏపీ హైకోర్టు న్యాయ‌మూర్తుల బ‌దిలీని నిర‌సిస్తూ న్యాయ‌వాదులు ఆందోళ‌న ..

AP High Court: ఏపీ హైకోర్టు న్యాయ‌వాదులు ఆందోళ‌న‌కు దిగారు. గురువారం సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణ‌యం స‌రైందికాద‌ని, న్యాయ‌మూర్తుల బ‌దిలీని వెన‌క్కు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. గురువారం ఏపీ, తెలంగాణ‌, మ‌ద్రాసు హైకోర్టుల నుంచి ఏడుగురు న్యాయ‌మూర్తుల‌ను బ‌దిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార‌సు చేసింది. వీరిలో తెలంగాణ రాష్ట్రం నుంచి ముగ్గురు, ఏపీ నుంచి ఇద్ద‌రు, మద్రాసు హైకోర్టు నుంచి ఇద్ద‌రు న్యాయ‌మూర్తులు ఉన్నారు. ఏపీలో ఇద్ద‌రు న్యాయ‌మూర్తుల‌ను బ‌దిలీ చేయ‌డం ప‌ట్ల న్యాయ‌వాదులు ఏపీ హైకోర్టు ఎదుట ఆందోళ‌న‌కు దిగారు. సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌డుతూ నినాదాలు చేశారు.

- Advertisement -

ఏపీ హైకోర్టుకు చెందిన న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ బ‌ట్టు దేవానంద్‌, జ‌స్టిస్ ర‌మేశ్ ల‌ను బ‌దిలీ చేస్తూ గురువారం జ‌రిగిన సుప్రీంకోర్టు కొలీజియం స‌మావేశం నిర్ణ‌యించింది. వీరి బ‌దిలీని నిర‌సిస్తూ ఏపీ హైకోర్టు న్యాయ‌వాదులు విధుల‌ను బ‌హిష్క‌రించారు. ఏపీ హైకోర్టు న్యాయ‌మూర్తుల బ‌దిలీ ప్ర‌తిపాద‌న వివ‌క్ష‌కు సంకేత‌మ‌ని వారు ఆరోపించారు. గుజ‌రాత్ హైకోర్టు న్యాయ‌మూర్తి బ‌దిలీని వెన‌క్కి తీసుకున్నార‌ని, అదేవిధంగా వెంట‌నే ఏపీ హైకోర్టు జ‌డ్జీల‌ బ‌దిలీని వెన‌క్కు తీసుకోవాల‌ని న్యాయ‌వాదులు డిమాండ్ చేశారు.

తెలంగాణ హైకోర్టు నుంచి ముగ్గురు న్యాయమూర్తులు, ఏపీ నుంచి ఇద్దరు, మద్రాసు హైకోర్టు నుంచి ఇద్దరిని బదిలీచేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం గురువారం సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న జస్టిస్ లలిత కన్నెగంటిని కర్ణాటక హైకోర్టుకు బదిలీచేస్తూ కోలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్ అభిషేక్ రెడ్డి పాట్నా హైకోర్టుకు, జస్టిస్ నాగార్జున్‌ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసింది. అదేవిధంగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవనంద్‌ను మద్రాసు హైకోర్టు‌కు, జస్టిస్ డి. రమేష్ ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసింది. వీరితో పాటు మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్టి టి. రాజును రాజస్థాన్ హైకోర్టుకు, జస్టిస్ వి.ఎం. వేలుమణిని కోల్‌కత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు కొలీజియం న్యాయశాఖకు సిఫారసు చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News